
చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మేరకు వెల్లడించారు. జపాన్ సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు.
2023లో ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్‌ను జాబిల్లిపైకి తీసుకెళ్లమని పేర్కొన్నారు. ఈసారి మాత్రం చంద్రయాన్-5 ద్వారా 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్‌ను 2027లో ప్రయోగిస్తామని వెల్లడించారు.
చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు మొదటిసారిగా 2008లో చంద్రయాన్-1 మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రుడిపై రసాయన, ఖనిజ, ఫొటో జియోలాజిక్ మ్యాపింగ్ చేశారు. ఇక చంద్రయాన్-2 మిషన్‌ను 2019లో చేపట్టగా, ఆ ప్రాజెక్ట్ దాదాపు విజయవంతం అయ్యింది. కానీ చివరి క్షణాల్లో విఫలమైంది.
అయితే ఈ మిషన్‌లోని ఆన్‌బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరా ఇప్పటి వరకు వందలాది ఫొటోలను పంపిన్నట్లు నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2 కొనసాగింపుగా చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టారు. దీనిని చంద్రుని ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్, రోవర్ మూమెంట్ పరీక్షల కోసం చేపట్టారు. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విజయవంతంగా దిగింది.
చంద్రుని నుంచి సేకరించి నమూనాలను తీసుకురావడమే లక్ష్యంగా 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను చేపట్టనున్నారని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.
More Stories
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కంచి కామకోటి పీఠాధిపతిగా గణేష శర్మ
పరువునష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు, విడుదల