
సంపన్న విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు మార్గం చూపించే గోల్డ్ కార్డ్ పథకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్డుదారుల హక్కులపై చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
శాశ్వాత నివాస కార్డులుగా అధికారికంగా పిలుచుకునే గ్రీన్ కార్డులు విదేశీ జాతీయులు అమెరికాలో నివసించేందుకు, పని చేసేందుకు హక్కులు కల్పిస్తాయి. అయితే, శాశ్వత నివాసం అని పేరు పెట్టినప్పటికీ నిరవధికంగా ఉండిపోయే హక్కుగా మాత్రం పరిగణించరాదు. గ్రీన్ కార్డుదారునికి అమెరికాలో నిరవధికంగా నివసించే హక్కు ఉండబోదని వాన్స్ తాజాగా ప్రకటించారు.
ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదని, ఇది తమ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. గ్రీన్ కార్డుదారులను తమ సమాజంలో చేర్చుకోవాలా వద్దా అన్న విషయమై అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొన్ని అత్యవసర పరిస్థితులలో గ్రీన్ కార్డును రద్దు చేయడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి.
గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా లో నిరంతరం ఉండలేరని, ఆ హక్కు గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఉండబోదని, అమెరికా ప్రభుత్వం తలచుకుంటే వారిని వారి దేశాలకు డిపోర్ట్ చేయవచ్చని స్పష్టం చేశారు. పాలస్తీనా అనుకూల కార్యకలాపాలు నిర్వహించినందుకుగాను కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని డిపోర్ట్ చేసే విషయం గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రీన్ కార్డు అనేది ప్రవాస చట్టాన్ని ఉల్లంఘించే చర్యలు చేపట్టనంత వరకు అమెరికాలో ఉండి, పనిచేసుకునే శాశ్వత నివాస హక్కును ఇస్తుంది. అమెరికాలో అత్యధిక గ్రీన్ కా ర్డులు కలిగిన వారిలో రెండో స్థానం భారతీయులదే. కాగా, ప్రతిపాదిత గోల్డ్ కార్డ్ కార్యక్రమం ద్వారా 50 లక్షల డాలర్లు(దాదాపు రూ.43 కోట్లు) ఫీజు చెల్లించి అమెరికాలో నివసించి, పని చేసే హక్కును విదేశీ పౌరులు పొందవచ్చు. ప్రస్తు తం అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా స్థానంలో ఈ పథకం రానున్నది.
More Stories
చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్
ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు
శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు