భారత్ కు `హలాల్’ రూపంలో మరో కొత్త సంకటం

భారత్ కు `హలాల్’ రూపంలో మరో కొత్త సంకటం

* ఆకారపు కేశవరాజు, విశ్వహిందూ పరిషత్ 

హలాల్ అంటే ముస్లింలు జంతువులను కోసే పద్ధతి అని మాత్రమే ఇప్పటివరకు  అనుకునేవారం. (హలాల్ అంటే:  ముస్లింలు దేవుడికి బలి ఇచ్చే ముందు అల్లాను ప్రార్థించి కల్మా చదివి జంతువు లేదా పక్షి శ్వాస నాళాన్ని, ఆ తదుపరి కంఠాన్ని కోసి రక్తం అంతా బయటికి వచ్చే విధంగా చేసి, గిలగిల  కొట్టుకుంటూ ప్రాణాలు వదిలిన  తదుపరి దానిని మాంసంగా మారుస్తారు. హిందువులేమో ‘జట్కా’ పద్ధతి అవలంబిస్తారు. అంటే ఒకేసారి పశువు తలను శరీరం నుండి వేరు చేయడం ద్వారా పశువుకు ఎక్కువ బాధ తెలియకుండా చేయడం అన్నమాట)
ఇప్పుడు ‘హలాల్’ పేరుతో కొత్త తతంగం మొదలైంది. అన్ని రకాల నిత్యావసర వస్తువులైన సబ్బులు,పేస్టు, మందులు, వస్తువులు, చెప్పులతో సహా చివరికి ఇస్లామిక్ మ్యారేజ్ సైట్ లు కూడా హలాల్ సర్టిఫికేట్ పొందినవిగా ప్రచారం చేసుకుంటున్న విచిత్ర వైనం కనబడుతున్నది.  దగ్గరగా గమనిస్తే ప్రమాణాలు ఏమైనా మారుతున్నాయా?

ఈ వస్తువులపై హలాల్ సర్టిఫికేట్ ముద్ర ఉంటున్నది. దీనికి ప్రభుత్వ గుర్తింపు అసలు లేని ప్రైవేటు సంస్థలు సర్టిఫికెట్లను జారీ చేస్తూ ఉన్నాయి. మరి అధికారులు స్పందించడం లేదా?  చాలా మంది ప్రభుత్వ అధికారులకు ఈ విషయమే తెలియదు.  మరికొందరు తెలిసినా దీని వలన పెద్ద నష్టమేమీ లేదు అంటూ దాటవేయడం, చట్టాల గురించి కానీ, ఆర్థిక నష్టాల గురించి గానీ, ముఖ్యంగా భారత ప్రజల నమ్మకాలు, స్వాభిమానం విషయంలో ఏ మాత్రం పట్టింపులేని బ్యూరోక్రసీ నిర్లిప్తంగా ఉండడం సహించరాని విషయం. వెంటనే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే నాయకులు కళ్ళు, చెవులు తెరుచుకుని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

ఎందుకు ఈ హలాల్ సర్టిఫికేట్ ?

ఈ సర్టిఫికెట్ లేనిదే వస్తువులు కొనమని కొంతమంది ప్రతి వస్తువును పరిశీలించి హలాలు సర్టిఫికెట్ ముద్ర ఉండటం గురించి డిమాండ్ చేస్తున్నారని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇక హోటల్స్, రెస్టారెంట్లు మొదలుకొని అనేక కంపెనీలు  డబ్బులు చెల్లించి హలాల్ సర్టిఫికెట్ తీసుకుని ప్రారంభిస్తున్నారు. ఈ సర్టిఫికెట్లు తీసుకొని వస్తువులను తయారు చేసి వాటిపై వారు నిర్దేశించిన గుర్తులను ముద్రిస్తున్నారు.

విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే కొన్ని స్వదేశీ పరిశ్రమలు కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడం ఒక తప్పని తతంగంగా మారిపోయింది. ఇలా ఆర్థిక లావాదేవీలు  నెమ్మది నెమ్మదిగా మొత్తానికి మొత్తంగా శాంతి కాముకులమని చెప్పుకొనే ఇస్లాం అనుయాయుల దయాదాక్షిణ్యాలపై కేవలం వ్యాపారాలు, పరిశ్రమలు మాత్రమే కాక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధార పడేటట్లు చేయడానికి పెద్ద కుట్రే జరుగుతున్నది.

50కి పైగా ఇస్లాం దేశాలు హలాల్ సర్టిఫికెట్ కలిగిన వస్తువులను మాత్రమే కొంటాము, ఉత్పత్తిని చేస్తామనే నిబంధనలు అంగీకరించాయి. డబ్బు చెల్లించి సర్టిఫికెట్  పొంది వ్యాపారాలు చేసుకోవడం కోసం  సమ్మతించాయి.  ఆశ్చర్యం మనదేశంలో కూడా ఈ హలాల్  సర్టిఫికెట్ కలిగి ఉండి లేదా ఆ ముద్రను కలిగి ఉన్న వస్తువులను మాత్రమే వాడతామని  మతం మత్తులో డిమాండ్ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తే కిక్కురుమనకుండా వేల రూపాయలు చెల్లించి హలాల్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. తినే ఆహారానికి కూడా మతం ఉంటుందా? అని ప్రశ్నించే అభ్యుదయ వాదులు కూడా కిక్కురు మనకుండా తింటున్నారు.
అసలు ఈ సర్టిఫికెట్లను ఎవరు ఇస్తున్నట్టు?
 
జమాతే ఇస్లామీ  హింద్ అనే సంస్థ, జమాతే ఉలేమా హింద్ (ఈ సంస్థలు  అనేక నేరాలకు పాల్పడిన  కార్యకర్తలను పోషిస్తున్నవని అనేక ఆరోపణలు ఉన్నాయి),  మహారాష్ట్ర జమాతే ఉలేమా ఈ హింద్,  హలాల్ ట్రస్ట్ భారతదేశంలో హలాల్  సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని తెలిసింది. ఈ సంస్థలు పి.ఎఫ్.ఐ లాంటి దేశీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. దీనిపై సమగ్రంగా ప్రభుత్వ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కొక్క హోటల్ కనీసం రూ. 20 వేలకు తగ్గకుండా అనుమతి కోసం చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే హోటల్ లు ఎన్ని ఉంటాయో ఒక్కసారి లెక్కిస్తే ఎంత మొత్తం అవుతుందో ?  ఒక రాష్ట్రంలో వేలాది రూపాయలు  లక్షలాది కంపెనీల నుండి  వసూలు చేస్తున్నారు.  ఈ మొత్తం  క్రమక్రమంగా  వేల కోట్ల రూపాయల  ఆదాయంగా  మారింది. ఈ విషయాన్ని ఎవరైనా ఆలోచించారా? 
 
ప్రభుత్వానికి సమాంతర ఆర్థిక వ్యవస్థను నడపడం కోసం కుట్రపూరితంగా పన్నిన వల ఇది. ఇలా సేకరించిన ధనం ఎవరి ద్వారా  ఎక్కడికి వెళ్తున్నది? ఎవరికి చెందుతున్నది? ఆరా తీసి సత్యాన్ని బయట పెట్టాలని కోరుతున్నాం.
మరోవైపు, ఆరోజుల్లో మాస్కు కట్టుకోకుండా ఆహారంతోపాటు చావును కూడా కరోనా రూపంలో వెంట తెచ్చిన వ్యక్తి నుండి  ఆహారాన్ని తీసుకోను అన్నందుకే
ఆహారాన్ని తెచ్చినవాడు ఫలానా మతానికి చెందినవాడని తెలిసి ఆహారాన్ని తిరస్కరిస్తావా? ఆహారానికి మతాన్ని జోడిస్తావా? అంటూ కేసులు పెట్టిన సెక్యులర్ ప్రభుత్వాలను చూసాము. 
 
అయితే, ప్రభుత్వేతర అనధికార జమాతే ఇస్లామీ హింద్ వంటి మత సంస్థలిచ్చే  హలాల్ సర్టిఫికేట్, దాని ముద్ర లేకపోతే ఈ వస్తువులను మేము వాడము, మీ దుకాణంలో హలాల్ సర్టిఫికెట్ ముద్ర లేని వస్తువును మేము కొనము‌, మీ హోటళ్లలో మీ రెస్టారెంట్లలో తినము అంటూ బైకాట్ చేసే ఈ బ్లాక్ మెయిల్ గాళ్ళను ఏమీ అనకపోవడాన్ని, వారిపై కేసులు పెట్టకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాం.
* సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ డబ్బులు తీసుకొని హలాల్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు ఇస్తున్నాడు సరే హలాల్ సర్టిఫికేట్ తీసుకునేవాడు ఎందుకు తీసుకుంటున్నాడు? ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించక పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.

* హలాల్ చేసిన జంతువులను, హలాల్ ముద్ర కలిగిన వస్తువులను పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఔషధాలు ఆయుర్వేదిక్ మందులు ముస్లింలతో పాటు మిగతా మతస్తులు ఎందుకు తినాలి? ఎందుకు వాడాలి గౌరవ ప్రభుత్వ అధికారులు పెద్దలు వివరించగలరా?

*ముస్లింలు వాడుతున్న ఉపయోగిస్తున్న, నమ్ముతున్న విషయాలను ముస్లిమేతరులు కూడా నమ్మాలని ఉపయోగించుకోవాలని, హలాల్ ముద్ర ఉన్న వస్తువులనే వాడాలని కోరడంలో ఏమైనా అర్థం ఉందా?
* ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 27కు విరుద్ధం కాదా? దీన్ని న్యాయస్థానాలలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

* కేరళ రాష్ట్రంలో హలాల్ అనుమతి కలిగిన భవనాల నిర్మాణం, సొసైటీల నిర్మాణం మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది?  క్రమంగా ప్రత్యేకమైన ముస్లిం భావాలు కలిగిన ప్రత్యేక భూభాగాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేయడమే కదా! ఇది వ్యతిరేకించదగిన భారత దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కలిగించే భయంకరమైన విధానం.

* వస్తువుల తయారీ జరిగే పరిశ్రమ దగ్గరికి హలాల్ సర్టిఫై చేసేందుకు వచ్చిన పరిశీలనా బృందం కోరుతున్న విషయాలు ఏమిటంటే, ఉదాహరణకు హలాల్ అనుమతి కలిగిన భవనాల నిర్మాణం విషయమే తీసుకుందాం:

ఈ భవనాల నిర్మాణం చేసిన వ్యక్తులు ఇస్లాంను అనుసరించే వాళ్ళుగా ఉండాలి. ఈ భవననర్మాణానికి సమీకరించే ఇటుకలు ఇస్లాంను నమ్మిన వాళ్లే తయారు చేసి ఉండాలి. చివరికి రంగులు ఇస్లాంను నమ్మేవాళ్ళు తయారు చేసినవే అయి ఉండాలి.  రంగులు వేసే వాళ్ళు కూడా ఇస్లాం నమ్మే వాళ్లై ఉండాలి ఇ.లా భవన నిర్మాణానికి వాడే ప్రతి వస్తువును తయారు చేసే ప్రతి వ్యక్తి ఇస్లాంను నమ్మిన వాడై ఉండాలి అనే మూల సూత్రాన్ని పరిశీలించి సిఫార్సు చేస్తేనే హలాల్ సర్టిఫికెట్ వచ్చేది.

ఇలా క్రమంగా హలాల్ అనే భావనకు వెనుక ఇస్లాం మత విస్తరణ, ఇస్లాం మత రాజ్య స్థాపన అనే వ్యూహం కూడా కనబడుతున్నది. దీనిని అర్థం చేసుకొని తగిన విధంగా స్పందించ వలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ బాధ్యతలను విస్మరిస్తే, ప్రజలు జాగృతమై ప్రభుత్వాలకు గుర్తు చేస్తారు. తమ దేశం, ప్రజల స్వాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటారని నిరూపిద్దాం.