మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే ఎస్బిఐ నిధులు 

మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే ఎస్బిఐ నిధులు 
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ ) మహిళాలకు పెద్ద బహుమతి అందించింది. ఇప్పడు మహిళలకు ఎస్బిఐ తక్కువ వడ్డీ రేట్లతో అన్‌సెక్యూర్డ్ రుణాలు అందించనుంది. దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్బిఐ `ఆస్మిత’  పేరుతో ప్రవేశపెట్టింది.
మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు అందించడమే దీని ముఖ్య ఉదేశ్యం.
మహిళలు నడిపించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు త్వరగా, సులభంగా క్రెడిట్ యాక్సెస్ పొందడానికి ఈ కొత్త పధకం సహాయపడుతుందని బ్యాంక్ చైర్మన్ సి ఎస్ శెట్టి తెలిపారు.  బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టోన్సే ఈ కొత్త ఆఫర్‌ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ అండ్ సామాజిక సమానత్వానికి చిహ్నం అని అభివర్ణించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఎస్బిఐ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ‘నారి శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది.

కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన మరోవైపు భారతీయ సంతతికి చెందిన మహిళల కోసం ‘బిఓబి గ్లోబల్ ఉమెన్ ఎన్ ఆర్ ఇ, ఎన్ ఆర్ ఓ  సేవింగ్స్ అకౌంట్’ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లకు లాకర్ రెంట్ పై డిస్కౌంట్’తో పాటు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ, హోమ్ లోన్ ఇంకా తక్కువ ప్రాసెసింగ్ ఛార్జ్’తో ఆటో లోన్ వంటి సౌకర్యాలు అందిస్తుంది.

“ఈ సేవింగ్స్ అకౌంట్ నేటి ప్రపంచ భారతీయ మహిళల మారుతున్న డైనమిక్స్ గుర్తిస్తుంది. దీని ద్వారా మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ అధికారాలు, ఆలోచనాత్మకంగా రూపొందించిన ఫీచర్స్ అందించడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి రూపొందించబడింది” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బినా వహీద్ పేర్కొన్నారు. 

కొత్తగా రూపొందించిన ఈ  సేవింగ్స్ అకౌంట్ చాలా ఫీచర్లతో వస్తుంది. వీటిలో మంచి ట్రాన్సక్షన్స్ లిమిట్’తో కస్టమైజ్ డెబిట్ కార్డ్, ఉచిత దేశీయ ఇంకా అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్, ఉచిత సేఫ్ డిపాజిట్ లాకర్లు, ఉచిత వ్యక్తిగత ఇంకా విమాన ప్రమాద బీమా కవరేజ్ ఉన్నాయని బ్యాంక్ తెలిపింది.