నిజాయతీకి నిలువుటద్దం సంచార జాతులు

నిజాయతీకి నిలువుటద్దం సంచార జాతులు

డా. శ్రీనివాసులు దాసరి
మాజీ ఐఏఎస్ అధికారి.
సంచారి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు
* దీన స్థితిలో కూడా ఆ మాతృమూర్తి ఆత్మవిశ్వాసం!
 
గతవారం అఖిల భారత సంచార జాతుల సమ్మేళనంలో పాల్గొనటానికి నాగపూర్ (మహారాష్ట్ర) వెళ్ళటం  మహద్భాగ్యం. ‘స్పూర్తి భవన్’ విశాల ప్రాంగణంలో స్వయం సేవకులతో దేశం నలుమూలల నుండి వచ్చిన ‘భటక్’, ‘ఘుమాంగ్’ జాతుల అపూర్వ కలయిక నయనానందకరం.
సంఘ పరివార్ పెద్దల ఆశీసులతో, మహారాష్ట్ర ఓబిసి శాఖ మంత్రి వర్యులతో కలిసి సభా వేదిక నుండి దిగి వస్తూవుండగా, ఒక మద్య వయస్కురాలు తన ముగ్గురు పిల్లలతో నన్ను కలవటం తటస్థించింది. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ కూతురు. పది సంవత్సరాల లోపు వయసు పిల్లలు. దురదృష్టం. విచారకరం. పెద్దవాడు వాడి తరువాత పుట్టిన ఆడపిల్ల పుట్టుకతో మూగ, చెవిటివారు కావటం. 
 
ఆ మహిళ చంకలో ఉన్న బాబు అదృష్టవశాత్తు ఏ అవయవలోపం లేకుండా పుట్టటం. భర్త చనిపోవడంతో  పిల్లల పాలనా పోషణ ఈ మహతల్లిదే. వృత్తి కంకర రాళ్లు కొట్టుకుంటూ నిర్మాణంలో ఉన్న రోడ్డు ప్రక్క జీవనం. నాగపూర్ మహా పట్టణ తాత్కాలిక వాసి. సభా స్థలికి ధగ్గర లో ఖాళీ స్థలంలో ప్లాస్టిక్ సంచుల పై కప్పుతో చిన్న గుడిసె లాంటి ఆవాసం వారి తాత్కాలిక విడది. 
 
అలాంటి మరి కొన్ని ఆవాసాలలో నివసిస్తున మురికి వాడ జనం. ఎంతో వేగంగా భవన నిర్మాణ కార్మికుల శారీరక శ్రమతో అందంగా అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఆనవాలు ఈ సంచార జాతులు. అభివృద్ధి వెనుకబాటు తనం ద్వంద ప్రవ్రుత్తులె ప్రకృతి రీత్యా. ఆ మాతృమూర్తి తన దీనస్థితిని మరాఠీ బాషలో ఏకరవు పెడుతుంటే, స్థానిక వాలంటీర్ నాకు వివరిస్తూ, మూగ, చెవిటి పిల్లలకు ఇలాజ్ (వైద్యం) చేయించమని వేడుకోలు . ఆ పిల్లలతో ముచ్చటించటం నాకెంతో ఊరట కల్గించిన మాట వాస్తవం. విచిత్రం.
 
ఆమె వివరాలు సేకరించే దిశగా, నా సహాయకుడు ఆమె మొబైల్ నెంబర్ అడిగితే, ఆ సౌకర్యం అమెకు అందుబాటులో లేకపోవడం విడ్డూరం. ఈ రోజుల్లో అరుదైన విషయం. అడ్రస్ ఎట్లా లేదు. రేషన్ కార్డు, ఓటర్ కార్డులు అసలు లేవు. ఆధార్ కార్డు అంతకంటే లేదు. సంచారులు ‘సామాజిక ఆనాధులు’ కదా మరి!
నా విజిటింగ్ కార్డ్ ఆమె చేతిలో పెడుతూ, పిల్లల వైద్యం , చదువు విషయమై ఆలోచిస్తానని భరోసా ఇవ్వటంతో, ఆమె మొహంలో గోచరించిన సంతృప్తి అంతా ఇంతా కాదు. అవసరమైన ఏర్పాట్లు చేయటానికి సమయం పడుతుంది అన్న ఆలోచనతో , పది రోజుల తర్వాత నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవల్సిందిగా ఆ మాహా తల్లిని కోరాను. 
 
శెలవు తీసుకునే ముందు, బాలిక చేతిలో ఐదు వందల రూపాయల నోటు పెట్టడం నా తప్పు. ఆశ్చర్యం. ఆ నోటు తిరిగి ఇస్తూ , ఆ మహా ఇల్లాలు అన్న మాటలు నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. పిల్లల ఆరోగ్యం, విద్య వసతి కల్పిస్తే చాలు సార్ ! డబ్బులు ఖర్చుయిపోతాయు అంటూ ఎంతో ఆత్మ విశ్వాసంతో ఆ మహిళ అంటుంటే సిగ్గు పడటం నా వంతైంది. 
 
డబ్బే ప్రధానం అన్న సమాజంలో సహజీవనం చేస్తున్న నాగరిక జీవిని కదా నేను! పేదవాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని, నిజాయితీని దెబ్బ తీసానే అన్న భావంతో కుంచించకు పోతూ. ఆమె, ఆ పిల్లలు నాకు కనుమరుగయ్యే లోపు, కార్యక్రంలో పాల్గొనటానికి వచ్చిన స్థానిక వైద్యుడు నా వద్దకు వచ్చి పరిచయం చేసుకోవటం కాకతాళియమేకాదు. ఆశ్చర్యకరం కూడా. ‘రోటి ఫౌండేషన్’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్న ఆ డాక్టర్ స్థానికంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న పరోపకారి. పేదల పాలిట అన్న ధాత. 
 
అతని ధర్మబుద్దిని కొనియాడుతూ, నా వద్దకు వచ్చి వెళ్లిన మహిళ పరిస్థితి వివరించాను. రెండో ఆలోచనకు తావు లేకుండా, ఆ మాహానుభావుడు పుట్టు మూగ, చెవిటి బాలిక, బాలుడిని వారి కోసం ఉద్దేశించబడిన హాస్టల్ వసతి ఉన్న మంచి స్కూల్లో చేర్పించే బాద్యత తీసుకోవటం నాకెంతో సంతృప్తిని కలిగించింది. 
 
మంచి చేయాలన్న తలంపు ఉండలే కానీ, ధైవ బలం తో, ఆ సంకల్పం దానంతతదే  సానుకూలం అవుతుంది అన్న పెద్దల మాట ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాను.  అ జన సమూహంలో, కనుమరుగైపోయిన ఆ మహిళను , ఆమె పిల్లల్ని వెదకటం లో నా సహాయకుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడికక్కడే ఆ ఆనాధ కుటుంబాన్ని ఆ ప్రముఖ వైద్యుడికి పరిచయం చేసే వీలు లేక పోయినoదులకు చింతిస్తూ, తిరుపతికి తిరుగు ప్రయాణం. ఆమె ఫోన్ కోసం ఎదురు చూడటం నా వంతు అయింది.
సరిగ్గా పది రోజులకు, ఆ మహిళ తమ్ముడి ఫోను, ఆమెతో మాట్లాడటం. రోటి ఫౌండేషన్ డాక్టర్ వివరాలు ఇస్తూ, నా సహాయకుడి (స్థానికంగా) ఫోన్ నెంబర్, అడ్రెస్ తెలియజెయటంతో, నాకెంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆమె సొదరుడు కూడా పెద్దగా చదువుకోలేదు.  ఇంగ్లీష్ లో ఫోన్ నెంబర్ చెబుతుంటే వ్రాసుకోలేక పోయాడు. ఒక కాగితం మీద వివరాలు వ్రాసి, దాని ఫోటో అతని స్నేహితుడి ఫోనుకు పంపటం లో ఇబ్బంది ఎదురైంది. అతని ఫోన్ లో ఆ సౌకర్యం లేదట. అరగంట తర్వాత , పక్కవాడి  ఫోన్ కు ఆ స్క్రీన్ షాట్ పంపటంతో, ఆమెకు తగిన సహకారం, సహాయం అందుతున్న ఆనందంతో .
కూడు, గుడ్డ, గూడు లేని వారే కావచ్చు కానీ, ఆత్మాభిమానం మెండుగా వున్న ఇలాంటి పౌరులు కానీ పౌరులకు, దేశ వాసులకు, దేవుడే దిక్కు. దైవ లీల. ఈ రోజు ఆ వైద్య ప్రముఖుడి నుండి నాకు ఫోన్. పిల్లలకు హాస్టల్ సౌకర్యం తో వారికోసం ఉద్దేశించిన స్కూల్లో ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.మనస్సులోనే ఆ మహానుభావుడి కి నమస్కరిస్తూ.