
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేయనుంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం ఈనెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈనెల 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో శాసనసభాపక్ష సమావేశాన్ని సోమవారమే నిర్వహించాలని తొలుత భావించినా తర్వాత వాయిదా వేశారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ న్యూడిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్‌వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నట్లు సమాచారం.
మొత్తంగా ఫిబ్రవరి 20న నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత డిల్లీలో అధికారం చేపడుతున్న నేపథ్యంలో రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి- ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అక్కడ అధికారంలోకి రానుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవలం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం