కాగా, గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను మాధవిలత తప్పుపట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆవేశంలో అలా మాట్లాడానని, తాను చేసింది తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. అయితే కొన్ని రోజుల క్రితం మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!