
వైవిధ్యీకరణ, ఇబ్బందులు లేని అతిపెద్ద కేంద్రంగా భారత్ మారుతున్నందున భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పారిస్‌లో జరిగిన 14వ ఇండియా-ఫ్రాన్స్ సిఇఓ ఫోరమ్‌లో ఆయన ప్రసంగిస్తూ నేడు భారతదేశం వేగంగా ప్రాధాన్యత గల ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు.
“ఇప్పుడే సమర్పించబడిన సమ్మిట్ నివేదికను నేను స్వాగతిస్తున్నాను. మీరందరూ ఆవిష్కరణ, సహకరించడం, సమగ్రపరచడం అనే మంత్రంతో పనిచేస్తున్నారని నేను చూస్తున్నాను. మీరు సంబంధాలను నిర్మించుకోవడమే కాదు, మీరు భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో ఈ సమ్మిట్‌లో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని ప్రధాని చెప్పారు.
“గత రెండు సంవత్సరాలలో ఇది మా ఆరవ సమావేశం. గత సంవత్సరం, అధ్యక్షుడు మాక్రాన్ మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉదయం మేము కలిసి కుత్రిమ మేధ యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించాము. ఈ విజయవంతమైన సమ్మిట్‌కు నేను అధ్యక్షుడు మాక్రాన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
“గత దశాబ్దంలో భారతదేశంలో జరిగిన మార్పుల గురించి మీకు బాగా తెలుసు. మేము స్థిరమైన, ఊహించదగిన విధానంతో కూడిన పర్యావరణ వ్యవస్థను స్థాపించాము. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మార్గాన్ని అనుసరిస్తూ, నేడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది” అని ప్రధాని వివరించారు.
“ప్రపంచ వేదికపై మా గుర్తింపు ఏమిటంటే, నేడు భారతదేశం వేగంగా ప్రాధాన్యత కలిగిన ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోంది. మేము భారతదేశంలో సెమీకండక్టర్, క్వాంటం మిషన్‌ను ప్రారంభించాము. రక్షణలో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’లను ప్రోత్సహిస్తున్నాము,” అని ప్రధాని తెలిపారు.
భారతదేశం కూడా హైడ్రోజన్ మిషన్‌ను చేపట్టిందని, 2047 నాటికి 100 జిడబ్ల్యు అణుశక్తిని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఆయన మోదీ చెప్పారు. “ఇది ప్రైవేట్ రంగానికి తెరవబడుతుంది. ప్రైవేట్ రంగాలకు పౌర అణు డొమైన్‌ను తెరుస్తున్నాము. మేము చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఎస్ఎంఆర్, అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్ (ఎఎంఆర్) లపై దృష్టి పెడుతున్నాము. భారతదేశానికి రావడానికి ఇది సరైన సమయం” అని ఆయన వివరించారు.
More Stories
357 ఆన్లైన్ మనీ గేమింగ్ సైట్స్‌పై కేంద్రం కొరడా
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి