
వీసా రద్దు సంబంధిత నోటీసులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “ఎక్స్’లో చాలా మంది విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు ఉద్యోగాల కారణంగా కఠినంగా ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. నిబంధనలను ఉల్లంఘించిన విద్యార్థులపై అధికారులు మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితి భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో చదువుకునే విద్యార్థులలో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారు. వారి ముఖ్యమైన ఆదాయ మార్గం పార్ట్ టైమ్ ఉద్యోగాలు కావడంతో, ఈ ఆంక్షలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనకుండా ఉండాలంటే, వీసా నిబంధనలను పూర్తిగా తెలుసుకుని అనుసరించడం మంచిది. అధికారులు ఎప్పుడు, ఏ రీతిగా ఆంక్షలు పెడతారో తెలియని పరిస్థితి ఉంది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను గౌరవించకుంటే, విద్యార్థులు మానసిక, ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు.
More Stories
ఏప్రిల్ 5న ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన
ఒక్క రోజులోనే 1000 ట్రంప్ గోల్డ్ కార్డుల విక్రయం
తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం ఎత్తేయాలి