
ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన చెందుతుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. సేవల రంగంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు.
సాఫ్ట్ వేర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యాన్ని కలిగి ఉందని చెబుతూ భారత్ బలాలేంటో మనకు తెలుసని తెలిపారు. భారత్ లో అందుబాటులో లేని ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవాలని చెబుతూ వాటిపై అధిక టారిఫ్ విధించి ఇండియాలోకి రాకుండా ఆపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పరోక్షంగా ఆర్ధిక మంత్రి ట్రంప్ కు హితవు చెప్పారు.
భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. అత్యంత అప్రమత్తతతో పరిస్థితులను గమనిస్తున్నాం అని ఆమె చెప్పారు. ఇతర దేశాలపై ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్లో విధించిన సుంకాల నుంచి పరోక్ష ప్రభావాలు ఉండవచ్చు, భారత్ అప్రమత్తంగా ఉండి తదనుగుణంగా మారుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!