
బీజేపీ ముందు కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుప్పిస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. మరో రోజులో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తమపై వత్తిడి తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యూహంగా త్రిసభ్య కమిషన్ భావిస్తున్నట్టు తేల్చి చెప్పింది.
ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తనదైన శైలిలో మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తరచూ ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఇలాంటి దురాశలకు ఎన్నికల సంఘం లొంగదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివేకంతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
అయితే ఎక్స్ ఖాతా వేదికగా ఈసీఐ స్పందిస్తూ ఎక్కడ ఆమ్ ఆద్మీ పేరు కానీ.. కేజ్రీవాల్ పేరు కానీ లేకుండా స్పందించింది. ఈ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలతోపాటు అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలపై 1.5 లక్షల మంది అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. వారంతా న్యాయ బద్దంగా, ఎక్కడ పక్షపాతం లేకుండా, స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసిజర్ ద్వారా నిపక్షపాతంగా పని చేస్తున్నారని ఈసీఐ స్పష్టం చేసింది.
కేంద్రంలోని బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందని మాజీ సీఎం కేజ్రీవాల్ సోమవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. “మీ పని మీరు చేయండి.. మీ పదవికి న్యాయం చేయండి” అంటూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్‍కు అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా సూచించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ నగర ప్రజల మెదళ్లలో కొన్ని సందేహాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని తీర్చండంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆయన సూచించారు. ఈ మాసాంతం మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నారని చెబుతూ ఆ క్రమంలో మీకు గవర్నర్? లేదా రాష్ట్రపతి? పదవి ఆశను కేంద్రం చూపించిందా? అంటూ ప్రశ్నించారు.
ఈ రెండు పోస్టుల్లో మీకు ఏ ఆశ చూపించిందంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను నమస్కరించి ఆయనకు ఒకటే సూచన చేయదలుచుకున్నానని తెలిపారు. మీ పని మీరు చేయండి.. మీ ఉద్యోగానికి తగిన న్యాయం చేయండని తాను రెండు చేతులు నమస్కరిస్తూ వేడుకొంటున్నానని తెలిపారు.
ఆయన ఉద్యోగం నుంచి రిటైరవుతోన్న వేళ.. దేశాన్ని, అలాగే దేశంలోని ప్రజాస్వామ్యాన్ని సైతం నాశనం చేయవద్దంటూ తాను వేడుకొంటున్నట్లు తెలిపారు. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీజపీ అభ్యర్థి పర్వేష్ వర్మ నగదు పంచుతున్నాడని కేజ్రీవాల్ ఈ మాసం మొదట్లో ఆరోపించిన విషయం విధితమే.
అతడిపై సీఈసీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అలాగే హర్యానా నుంచి న్యూఢిల్లీకి యమనా నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆ యమునా నదిలో విషం కలిపిందంటూ ఆయన ఆరోపణ గుప్పించారు.
కాగా అంతకు ముందు, తన ప్రత్యర్థి బిజెపికి చెందిన రమేష్ బిధురి గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఒక పోస్ట్‌లో ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన తర్వాత ఈసీ ఈ ప్రకటన చేసింది. ఆమె ఇలా అన్నారు” “ఎన్నికల కమిషన్ కూడా అద్భుతంగా ఉంది! రమేష్ బిధురి కుటుంబ సభ్యులు బహిరంగంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నేను ఫిర్యాదు చేసి పోలీసులకు, ఈసీఐకి ఫోన్ చేశాను. వారు నాపై కేసు నమోదు చేశారు! రాజీవ్ కుమార్: మీరు ఎన్నికల ప్రక్రియను ఎంతగా నాశనం చేస్తారు.”
ఆ తరువాత, అతిషి ఒక వీడియోను పోస్ట్ చేశారు: “బిజెపి సభ్యులు ప్రచార సామగ్రిని పంపిణీ చేయడం ద్వారా బహిరంగంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించబడింది. బిజెపి సభ్యులపై చర్య తీసుకునే ధైర్యం వారికి ఉందో లేదో చూద్దాం.”
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్