
తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రాష్ట్ర బిజెపి నాయకత్వం 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఆయా జిల్లాలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను రాష్ట్ర బిజెపి ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ సోమవారం అధికారికంగా నియమించారు.
త్వరలో మిగిలిన జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. బిజెపి రాష్ట్ర సంస్థాగత ఎన్నికల సహ అధికారి కె.గీతామూర్తి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఈ జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ ఆదేశించారని గీతామూర్తి వెల్లడించారు.
జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించి ఖరారు చేశామని, ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆమె వెల్లడించారు.
జిల్లాల కొత్త అధ్యక్షులు
జనగామ: సౌడ రమేష్, వరంగల్: గంట రవికుమార్, హన్మకొండ: కొలను సంతోష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి: నిశిధర్ రెడ్డి, నల్గొండ: నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్: దినేష్ కులాచారి, వనపర్తి: దుప్పల్లి నారాయణ, హైదారాబాద్ సెంట్రల్” లంకాల దీపక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి రూరల్: బుద్ది శ్రీనివాస్, కొమురం భీమ్ ఆసిఫాబాద్: శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి: నీలం చిన్న రాజులు, ములుగు: సిరికొండ బలరాం.
మహబూబ్ నగర్: పి.శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల: రాచకొండ యాదగిరి బాబు, మంచిర్యాల: వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి: కర్రే సంజీవరెడ్డి, ఆదిలాబాద్: పతంగి బ్రహ్మానంద్, మెదక్: వల్దాస్ రాధా మల్లెష్ గౌడ్, మహంకాళి సికింద్రాబాద్: గుండగోని భరత్ గౌడ్‌లను జిల్లా అధ్యక్షులుగా బిజెపి రాష్ట్ర శాఖ నియమించింది.
More Stories
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!
చార్ ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు
అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు