
ఇంటర్నేషనల్ క్రికెట్ అత్యధిక పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సచిన్. సెంచరీల్లోనూ సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడు. టెస్ట్ క్రికెట్‌తో పాటు, వన్డే ఫార్మాట్‌లోనూ సచిన్ అనేక రికార్డులు నెలకొల్పాడు. అతను వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేయగా, ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక టెస్ట్‌ల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన కెరియర్‌లో కేవలం ఒకే ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు ఆటగాడు సచిన్ టెండూల్కర్. భారత్ తరఫున మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. 48.52 సగటుతో 34,357 పరుగులు చేశాడు. వీటిలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సచిన్ కేవలం అద్భుతంగా పరుగులు సాధించడమే కాకుండా క్రికెట్‌కు ఐకాన్‌గా మారాడు. 1989లో 16 సంవత్సరాల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు విశేష సేవలు అందించాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సచిన్ సభ్యుడు కాగా, కప్‌ని గెలువడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు.
సచిన్ తన బ్యాట్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బౌలర్లు సైతం వణికించాడు. దివంగత షేన్ వార్న్ నుంచి ముత్తయ్య మురళీధరన్ వరకు అందరూ సచిన్‌ను ప్రశంసించారు. ఏ సమయంలోనైనా మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా సచిన్లో ఉందని చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖ బౌలర్లు సైతం సచిన్‌కు బౌలింగ్ చేయడం కష్టమని పనిగా చెప్పారు.
పోటీ జట్లు సచిన్‌ను అవుట్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించేవి. అవార్డుకు ఎంపికైన సచిన్ టెండూల్కర్‌కు పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం