ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్లుగా స్మృతి, బుబ్రూ

ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్లుగా స్మృతి, బుబ్రూ

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానలకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 సంవత్సరానికిగాను టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు.  జో రూట్‌ (ఇంగ్లాండ్‌), కమిందు మెండిస్‌ (శ్రీలంక), హ్యారీ బ్రూక్‌ (ఇంగ్లాండ్‌)లను వెనక్కినెట్టి బుమ్రా ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన 2024 సంవత్సరానికిగాను వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకుంది. లారా వోల్వార్డ్ట్‌ (దక్షిణాఫ్రికా), చమరి ఆటపట్టు (శ్రీలంక), అన్నాబెల్‌ సదర్లాండ్‌ (ఆస్ట్రేలియా)తో పోటీపడి ఈ అవార్డును సొంతం చేసుకుంది.  28 ఏళ్ల మంధాన ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. 2018లో మొదటిసారిగా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. అలాగే పురుషుల విభాగంలో వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు అఫ్గానిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జారు ఎంపికయ్యాడు.

గ‌త ఏడాది వ‌న్డే క్రికెట్‌లో స్మృతి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. 2024లో ఆమె ర‌న్‌మెషీన్‌లా స్కోర్ చేసింది. కేవ‌లం 13 వ‌న్డేల్లో 747 ర‌న్స్ చేసిందామె. భార‌త జ‌ట్టు విజ‌యాల్లో బ్యాట‌ర్ స్మృతి కీల‌క పాత్ర పోషించింది. జూన్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌లో ఇండియా 3-0 తేడాతో గెల‌వ‌డంలో స్మృతి కీల‌కంగా నిలిచింది. అక్టోబ‌ర్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో తుది వ‌న్డేల్లో సెంచ‌రీతో చెల‌రేగింది. డిసెంబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి త‌న స‌త్తా చాటిందామె. మ‌హిళ వ‌న్డే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో .. స్మృతి మందానా కొత్త స్టాండ‌ర్డ్‌ను నెల‌కొల్పింది. 

ఓ క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రంలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా నిలిచింది. 2024లో ఆమె 13 మ్యాచుల్లో 747 ర‌న్స్ చేసింది. దీంతో మ‌హిళ‌ల వ‌న్డేల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ మందానా.. లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచింది. లౌరా వోల్వార్డ్ 697, ట‌మ్మీ బీమౌంట్ 554, హేలే మాథ్యూస్ 469 ర‌న్స్‌తో ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు.

మందానా 57.86 స‌గ‌టుతో బ్యాటింగ్ చేసింది. ఆమె స్ట్ర‌యిక్ రేట్ 95.15గా ఉంది. దూకుడు ఆట‌తీరుతో ఇండియ‌న్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల‌లో ఆమె ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్న‌ది. గ‌త ఏడాది స్మృతి మందానా.. నాలుగు వ‌న్డే సెంచ‌రీలు న‌మోదు చేసింది. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇదో కొత్త రికార్డు. 2004లో వ‌న్డేల్లో వంద‌కుపైగా బౌండ‌రీల‌ను బాదింది. వీటిల్లో 95 ఫోర్లు, ఆరు సిక్స‌ర్లు ఉన్నాయి.

స్వ‌దేశీతో పాటు విదేశీ పిచ్‌ల‌పై 20204లో బుమ్రా స‌త్తా చాటాడు. త‌న స్పీడ్ బౌలింగ్‌తో భార‌త్‌కు కీల‌క విజ‌యాల‌ను అందించాడు. 2024లో అత‌ను 13 టెస్టు మ్యాచ్‌లు ఆడి 71 వికెట్ల‌ను తీసుకున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని మ‌ళ్లీ టెస్టులు ఆడిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

31 ఏళ్ల బుమ్రా గ‌త ఏడాది 14.92 స‌గ‌టుతో వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ త‌న ప్రెస్ రిలీజ్‌లో బుమ్రా బౌలింగ్ రికార్డుల‌ను విశేషేంగా మెచ్చుకున్న‌ది. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో జ‌రిగిన స్వ‌దేశీ సిరీస్‌లో భార‌త జ‌ట్టు విజ‌యంలో బుమ్రా కీల‌క పాత్ర పోషించాడు. ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జ‌రిగిన సిరీస్‌ల్లోనూ అత‌ను అత్య‌ధికంగా వికెట్ల‌ను తీశాడు.