
గ్రేటర్ హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఏకంగా ఏడు కార్పోరేషన్లు 20 మునిసిపాలిటీలు గ్రేటర్ లో విలీనం చేసేందుకు సిద్దమైన ప్రతిపాదనల పై ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుంది.
గ్రేటర్ ఎన్నికలు సహితం అందుకోసం వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఏడాది లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధి పెంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్(
ఓఆర్ఆర్ వరకు నగరాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా నడిపించేందుకు విలీనం ద్వారా ఒకటే మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ పరిపాలన సౌలభ్యం కోసం రెండు లేదా మూడు భాగాలుగా విడగొట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన పరిష్కారం చూపించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది. గ్రేటర్ లో విలీనం చేసేందుకు జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే ఓఆర్‌ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి.
గ్రేటర్ కార్పొరేషన్‌తో పోలిస్తే అభివృద్ధి విషయంలో వీటి మధ్య వ్యత్యాసం ఉంది. ఈక్రమంలో ఓఆర్‌ఆర్ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు జీహెచ్‌ఎంసీ 2 వేల చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది.
ఓఆర్‌ఆర్ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష న్లను జీహెచ్‌ఎంసీలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధింత కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో తీర్మానం చేయాలి. కానీ, వాటిల్లో కాంగ్రెస్ కు మెజార్టీ లేదు.
ఇదే సమయంలో జిహెచ్ఎంసి పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉంది. మరోవైపు ఈ 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి, అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం విడగొట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
More Stories
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!
చార్ ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు
అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు