
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈనెల 27న మహాకుంభమేళాకు హాజరుకానున్నట్లు తెలిసింది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాపూజ నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్న.
ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో రోజైన మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు.
సోమవారంన 54.96 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు.
లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెటప్ చేశారు. రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. మతపరమైన అకాడాలకు కూడా ప్రత్యేక టెంట్లను కేటాయించారు.
సోమవారం రోజున 54.96 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెటప్ చేశారు. రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. మతపరమైన అకాడాలకు కూడా ప్రత్యేక టెంట్లను కేటాయించారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యతో ఒడిశా యూనివర్సిటీలో ఉద్రిక్తత