ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. అసభ్యకర మెసేజ్లతో తన ఇన్స్టా అకౌంట్కి పదేపదే ట్యాగ్ చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి అగర్వాల్ పేర్కొంది. నిందితుడిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ పోలీసులను కోరింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్ ‘రాజా సాబ్’లోనూ నటిస్తున్నారు.

More Stories
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదలపై రాజీలేని పోరాటం
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి
కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి