జనవరి 10 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామని, అందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టామని టిటిడి ఈఓ శ్యామలా రావు ప్రకటించారు. పది రోజుల్లో 7 లక్షలమంది దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామని, జనవరి 9 న సర్వదర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జనవరి 10 ఉదయం 4:30 గంటలకు విఐపీ దర్శనం ఉందని, 8:30 గంటలకు సామాన్య భక్తులు దర్శనం ఉంటుందని చెప్పారు. ఏకాదశి నాడు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందని, 12 గంటలకు వాహన మండపంలో భక్తులు కోసం ఉత్సవమూర్తులుంటారని తెలిపారు. ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం ఉంటుందని, 9వ తేది ఉదయం 5 గంటలకు తిరుమల తిరుపతి లో 94 కౌంటర్ లో టోకెన్ లు కేటాయిస్తున్నామని, 10, 11, 12 తేదిలకు 9 తేది కేటాయింపులున్నాయని వివరించారు.
తక్కిన రోజుల్లో ఏరోజుకారోజు మూడు ప్రదేశాలలో టోకెన్ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆన్ లైన్ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించామని, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఉన్న వారికే పది రోజుల పాటు దర్శనం, టికెట్లు లేకుంటే దర్శనం లేదు అని స్పష్టం చేశారు.
సిఫార్సు లేఖలు రద్దు చేశామని, వసతి ఎవరు ముందు వస్తే వారికే కేటాయిస్తామని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని, 12 వేల వాహనాలకు వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విఐపీలకు రాంభకిఛ వద్దే వాహనాలు అనుమతిస్తామని, భద్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.
టోకెన్ ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశామని, అన్న ప్రసాద కేంద్రం ఉదయం ఆరు గంటల నుండి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ఆలయంలో అలంకరణ ప్రత్యేక నిపుణులతో చేయిస్తున్నామని వివరించారు. మూడువేల శ్రీవారి సేవకుల సేవలు వాడుకుంటామని తెలిపారు.
తిరుపతి జిల్లా యస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి విఐపీ అధికంగా ఉన్న సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తామని తెలిపారు. భక్తులకు టికెట్ పైనే రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామని, క్యూఆర్ కోడ్ ద్వారా తిరుమల లో రూట్ మ్యాప్ తెలుసుకోవచ్చునని చెప్పారు. మూడు వేలమందితో వైకుంఠ ఏకాదశి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి