* దిల్ రాజ్, పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిపై సర్వత్రా విస్మయం!
రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంతో మరణించారు. దీంతో చిత్ర బృందం తరపున చెరో రూ. 5 లక్షల పరిహారం ప్రకటించి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజ్ సరిపెట్టుకొంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున మరో రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి ఊరుకున్నారు.
సరిగా నెలరోజుల క్రితం హైదరాబాద్ లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై ఈ ఇద్దరు వ్యక్తం చేసిన ఆందోళన, ఆవేదన ప్రస్తుతం కనిపించక పోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మరణించిన ఘటనపై పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుపై వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన ఇద్దరు అభిమానులు చనిపోవడం బాధాకరమన్న ప్రముఖ నటి, మాజీ మంత్రి ఆర్ కె రోజా తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి మూడు రోజులైనా పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించకపోవటం అమానవీయం అని విమర్శించారు. తెలంగాణలో పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమంటూ ఆమె ట్వీట్ చేశారు.
తెలంగాణాలో జరిపిన సినిమా హత్యకు రూ. 2 కోట్లు ఒక ఉద్యోగం పరిహారంగా దిల్ రాజ్ రాబట్టగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు సినిమా హత్యలులకు రూ. 10 లక్షలా? దిల్ రాజ్ ఇది నీకు తగునా! అనే విమర్శలు చెలరేగుతున్నాయి.
హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్పా సినిమాకు వచ్చిన సినిమా హీరో అల్లు అర్జున్ ను చూడటానికి వచ్చిన తొక్కిసిలాట ఘటనలో తల్లి రేవతి చనిపోయారు. ఆఘటనలో ఆమె బిడ్డ తేజ నేటికి కోలుకోలేని స్థితిలో ఉన్నారు.
ఆ ఘటనలో `పెద్దమనిషి’ పాత్ర పోషించిన సినీ నిర్మాత దిల్ రాజ్ అల్లు కుటుంబంతో ఒక రూ. కోటి , పుష్ప యూనిట్ నుండి మరో రూ. కోటి దగ్గర వుండి ఇప్పించారు . మృతురాలు భర్తకు ఉద్యోగం సైతం ఇప్పించనున్నారు. చికిత్స పొందుతున్న తేజ వైద్య ఖర్చులు సైతం భరిస్తున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఆ ఘటనలో అల్లు అర్జున్ తన అభిమానులను సంధ్య థియేటర్ వద్దకు రండి అని పిలుపు ఇచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ, రామ్ చరణ్ హీరోగా వస్తున్న “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ ఈవెంట్ ఫంక్షన్ రాజమండ్రి వేమగిరి ప్రాంతం వద్ద జరుగుతుంది మెగా అభిమానులు తరలి రండి అని సినిమా యూనిట్ నిర్వాహకులనుండి బారిగా పిలుపునిచ్చారు.
అందుకు అవసరమైన అధికారిక సహాయ సహకారాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ , ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా గేమ్ చేంజర్ ఈవెంట్ ను ప్రోత్సాహించారు. ఒక ప్రైవేట్ సినిమా కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఈ విధంగా అండ దండలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ లో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
గేమ్ ఛేంజర్ సినిమా యూనిట్ పిలుపు మేరకు యువత భారీగా తరలి వచ్చారు. ఇద్దరు యువకుల అకాల మరణానికి కారకులయ్యారు. తెలంగాణాలో జరిగిన ఘటనకు మొత్తంగా రూ. 2 కోట్లు, ఒక ఉద్యోగం, వైద్య ఖర్చులుకు బాధ్యత వహించిన దిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో జరిగిన సినిమా హత్యలకు రూ. 10 లక్షలతో చేతులు దులుపుకోవడం గమనార్హం.
పైగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ, అరెస్ట్ కూడా చేశారు. కానీ, రాజమండ్రి సినిమా కార్యక్రమం నిర్వాహకులు ఎవ్వరిపై ఇద్దరు మృతి చెందినా ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు