కనిష్టస్థాయికి తగ్గిన తీవ్రమైన పేదరికం

కనిష్టస్థాయికి తగ్గిన తీవ్రమైన పేదరికం

2024లో దేశంలో పేదరిక రేటు 5 శాతం కంటే దిగువకు పడిపోవడంతో, ఎస్‌బిఐ అధ్యయనం కూడా దేశంలో తీవ్రమైన పేదరికం కనిష్టస్థాయికి తగ్గినట్లు స్పష్టం చేసింది. ఇది ”సమగ్ర స్థాయిలో’ భారతదేశంలో పేదరికం రేట్లు ఇప్పుడు 4-4.5 శాతం పరిధిలో ఉండవచ్చు. భావిస్తున్నాం. దీంతో దాదాపు తీవ్రమైన పేదరికం అత్యల్ప స్థాయిలో ఉంది అని అధ్యయనం పేర్కొంది.

కుటుంబాల వినిమయ వ్యయం సర్వే (హెచ్‌సిఇఎస్‌) నివేదిక ఆధారంగా గత కొన్నేళ్లలో గ్రామీణ, పట్టణ పేదరిక స్థాయిలలో గణనీయమైన తేడాలు వచ్చాయని ఎస్‌బిఐ సర్వే హైలెట్‌ చేసింది. సర్వే ప్రకార గ్రామీణ పేదరికం 2024 ఆర్థిక సంవత్సరంలో 4.86 శాతంగా అంచనా వేయగా, ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా, 2012 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతం కంటే గణనీయంగా తగ్గింది. 

అలాగే. 2012, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 13.7 శాతం, 4.6 శాతంగా ఉన్న పట్టణ పేదరికం 2024లో 4.09శాతానికి పడిపోయింది. సర్దుబాటు చేసిన దారిద్య్రరేఖ, భిన్నమైన పంపిణీ సమాచారం ఆధారంగా 2024 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిష్పత్తి 4.86 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.09 శాతంగా లెక్కించబడింది. 

2023- 24 ఆర్థిక సంవత్సరానికి దారిద్య్రరేఖను గ్రామీణ ప్రాంతాలకు రూ.1,632 మరియు పట్టణ ప్రాంతాలకు రూ.1,994గా నిర్ణయించారు. గ్రామీణ పేదరికం తగ్గుదలకి దిగువ 5 శాతం జనాభాలో వినియోగం పెరగడం దారిద్య్ర రేఖలో మార్పుకు దారితీసిందని నివేదిక తెలిపింది.