కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓ ఎన్ డి సి) చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించి, ఇ-కామర్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఓ ఎన్ డి సి, కొనుగోలుదారు యాప్‌లు మరియు విక్రేత యాప్‌లతో సహా 200 కంటే ఎక్కువ యాప్‌ల నెట్‌వర్క్, 2021లో భారతదేశంలో ఇ-కామర్స్‌ను ప్రజాస్వామ్యీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించబడింది.
ఓ ఎన్ డి సి దేశంలో అభివృద్ధి, శ్రేయస్సును అందిస్తున్నది అని ప్రధాన మంత్రి చెప్పారు. “చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడంలో మరియు ఇ-కామర్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఓ ఎన్ డి సి కీలకంగా పనిచేస్తుంది. దీని ద్వారా వృద్ధి, శ్రేయస్సును మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది” అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన పోస్ట్‌ను వివరిస్తూ, ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఎన్ డి సి దేశంలోని ఇ- కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని గోయల్ చెప్పారు. విక్రేతలు, కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. “ ఓ ఎన్ డి సి ఒక బలమైన మరియు అనుసంధానమైన డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను నిర్మించింది” అని గోయల్ తెలిపారు.
గత సంవత్సరంలో నెట్‌వర్క్ అనేక మైలురాళ్లు సాధించడమే కాకుండా, వ్యాపారాలకు, ముఖ్యంగా చిన్న సంస్థలకు ఒక సమానమైన స్థాయి పద్ధతిని సృష్టించిందని ఆయన చెప్పారు. “అమ్మకందారులు మరియు కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా, ఓ ఎన్ డి సి దేశంలోని ఇ-కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది!” అని గోయల్ తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో, ఓ ఎన్ డి సి 200 నెట్‌వర్క్‌లతో 150 మిలియన్ల లావాదేవీలను నమోదు చేసుకుంది.
ప్లాట్‌ఫారమ్‌లో 7 లక్షల మంది విక్రేతలు మరియు సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. 600 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలలో విక్రేతలు పాల్గొంటున్నారు. 1,100 నగరాలు, పట్టణాల నుండి వినియోగదారులు నెట్‌వర్క్ ద్వారా లావాదేవీలు చేసారు. అలాగే, 35 లక్షల మంది రైతులను ప్రాతినిధ్యం వహించే 7,000 కంటే ఎక్కువ రైతు-ఉత్పత్తి సంస్థలు ఈ వేదికలో భాగంగా ఉన్నాయి.
ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఎనేబుల్‌మెంట్, మార్కెటింగ్ ఇనిషియేటివ్ (ఎంఎస్ఎంఈ- టీమ్)లో దాదాపు 50 శాతం మహిళల యాజమాన్యంలోని సంస్థలు, ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాదాపు 5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ( ఎంఎస్ఎంఈలు) మద్దతు అందిస్తోంది.
More Stories
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?