
భారతీయ గగనతలంలో 10,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించడానికి అనుమతించినపుడు వైఫై ద్వారా మాత్రమే విమానంలోని ప్రయాణికులు ఇంటర్నెట్ సర్వీసులను వాడడం సాధ్యమవుతుందని టెలికం శాఖ నవంబర్‌లో ప్రకటించింది.
అంతర్జాతీయ విమానాలలో వైఫై సర్వీసులను అమలు చేస్తున్న నేపథ్యంలో దేశీయ విమానాలలో కూడా వైఫై ఇంటర్నెట్ సర్వీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా గ్రూపులో ప్రస్తుతం దాదాపు 300 విమానాలు ఉన్నాయి. వీటిలో ఎయిర్ ఇండియాతోపాటు తక్కువ చార్జీలతో నడిచే దాని అనుబంధ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనమైంది. తర్వాత విస్తారా సైతం విలీనమైంది.
More Stories
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్