అయితే, మిగతా ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణానికి హాని కలిగించే చర్యల వల్ల ఇప్పటికే అంటార్కిటికాకు ముప్పు వాటిల్లుతున్నది. ఇక్కడి మంచు వేగంగా కరిగి సముద్ర మట్టం పెరుగుతున్నది. ఇప్పుడు ఏకంగా అంటార్కిటికా నుంచి చమురు వెలికితీయాలనే రష్యా ప్రయత్నాలు ఈ ఖండానికి మరింత నష్టం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది చివరకు యావత్ ప్రపంచానికే నష్టం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవంక, చందమామపై కాలు పెట్టాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ఏకంగా చంద్రుడిపై మైనింగ్ అవకాశాలను అన్వేషిస్తున్నాయి. చంద్రుడిలో అనేక అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ దశాబ్దం చివరి కల్లా చంద్రుడిపై మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని పలు దేశాలు, ప్రైవేటు కంపెనీలు భావిస్తున్నాయనే చర్చ జరుగుతున్నది.
ఈ ప్రయత్నాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడిపై మైనింగ్ చేయడం వల్ల భారీగా దుమ్ము రేగుతుంది. ఈ దుమ్మును నెమ్మదించే వాతావరణం చంద్రుడిపై లేనందున చాలా దూరం ప్రయాణించే ప్రమాదం ఉందని, తద్వారా అంతరిక్ష ప్రయోగాలకు ముప్పుగా మారొచ్చనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై పర్యావరణ వ్యవస్థలు, అలలు, జీవ మనుగడను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

More Stories
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ పాక్ లో కాల్చివేత!
మోదీని పాములవాడిగా చూపిన నార్వే జాత్యహంకార కార్టూన్!
మారణహోమ చర్యలతో మసకబారిన పాక్ సుదీర్ఘ చరిత్ర