కేటీఆర్ పై కేసు పెడితే ఏ మంత్రి సంతకం చేయరు

కేటీఆర్ పై కేసు పెడితే ఏ మంత్రి సంతకం చేయరు

* కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఫైల్ పైన సంతకం పెట్టాడని కేసు పెడితే దేశంలో ఇక ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయరని,  కేటీఆర్‌పై 409 సెక్షన్ అమ‌లు చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉంటుందని కోర్టులో కేటీఆర్ త‌ర‌పు న్యాయ‌వాది సిద్ధార్థ్ ద‌వే వాద‌న‌లు ఇలా కొన‌సాగాయి. 

 
ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్ వ్యవ‌హారంలో కేటీఆర్ క్వాష్ పిటిష‌న్‌పై జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ్ బెంచ్ ముందు కేటీఆర్ త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తూ  బాంబే హైకోర్టులో ఇప్పటివరకు విచారణ జరిగిన కేసుల ఉదాహరణలు ఎన్నో మీకు అందజేయగలనని చెప్పారు. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. గతంలో కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

ఒక మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. ఏసీబీ చెపుతున్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవు అని.. అవి కూడా నిర్వహకుల ఖాతాలోకి వెళ్తాయని వాదనలు వినిపించారు సిద్ధార్థ్ ద‌వే. ఇక డబ్బులు చేరిన సంస్థను నిందితుడిగా చేర్చ‌లేదని అడ్వ‌కేట్ సిద్ధార్థ్ ద‌వే కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో కేటీఆర్‌కు 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదు. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇక్కడ థ‌ర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా చెప్పలేదు అని కేటీఆర్ త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్న‌ది అవాస్తవం. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఆయ‌న‌ ముందు పెట్టిన ఫైల్‌పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధ‌న ఉందా? అలా నిబంధ‌న ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది అని అడ్వ‌కేట్ సిద్ధార్థ్ ద‌వే వాదించారు.