లోక్‌సభ ఎన్నికల్లో తమకు 43.55 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి 43.71 శాతం ఓట్లు పోలయ్యాయని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. కేవలం 0.16 శాతం ఓట్ల తేడావల్ల వాళ్లు 31 స్థానాల్లో గెలిస్తే, తాము 17 స్థానాల్లో మాత్రమే గెలిచామని గుర్తు చేశారు. అప్పుడు వాళ్లు ఈవీఎంలపై ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఈవీఎంల స్కామ్‌ను సాకుగా చూపి ఆదివారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదని, కానీ ఇవాళ చేశారని, అంటే ఒకరోజులో ఈవీఎంల స్కామ్ ముగిసిపోయిందా? అని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవంక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా శరద్ పవార్ ఆదివారం షోలాపూర్ జిల్లా మర్కద్వాడి గ్రామంలో ఈవిఎం వ్యతిరేక నిరసనను నిర్వహించడం పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవార్ అబద్ధాలు చెబుతూ, మహారాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ మాట్లాడుతూ చంద్రశేఖర్ బవాన్‌కులే మాట్లాడుతూ శరద్ పవార్ ఓటమిని అంగీకరించాలని స్పష్టం చేశారు.
“ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.. లోక్‌సభ ఎన్నికల్లో వారు చెప్పిన అబద్ధాలన్నింటినీ ప్రజలు తిరస్కరించారు. వయసులో ఉన్న వ్యక్తికి అబద్ధం చెప్పడం తగదు” అని ధ్వజమెత్తారు. “మహారాష్ట్ర ఆయనను గౌరవిస్తుంది. మర్కద్వాడిలో అనేక ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ఈవీఎంలపై అనేక ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికలను వారు ఎన్నడూ తిరస్కరించలేదు” అని గుర్తు చేశారు.
“తమ ప్రజలు 31 మంది ఎంపీలుగా ఎన్నికైనప్పుడు వారు ఏమీ మాట్లాడలేదు… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పరువు కాపాడుకునేందుకు పవార్ సాహబ్ తిరుగుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోతారని ఆయనకు తెలుసు” అంటూ మండిపడ్డారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి