రైతుల ‘ఛలో ఢిల్లీ’ ఉద్రిక్తం.. లాఠీ చార్జ్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగం

రైతుల ‘ఛలో ఢిల్లీ’ ఉద్రిక్తం.. లాఠీ చార్జ్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగం
పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు ఉన్న రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఆదివారం తిరిగి ప్రారంభించారు. వారని అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. సరిహద్దుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.  శుక్రవారమే శుక్రవారం సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా సారథ్యంలో 101మంది రైతులు చలో దిల్లీ పాదయాత్రను ప్రారంభించారు.
అప్పుడు పోలీసులకు, రైతుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దానితో రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌- హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌ నుంచి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీ చార్జ్‌ చేశారు.

అయితే తమ ఢిల్లీ ఛలో యాత్రకు ముందే పోలీసుల అనుమతి తీసుకున్నామని, ముందుగా అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా ఢిల్లీ ఛలో ర్యాలీలో భాగంగా ఢిల్లీలోకి 101 మంది రైతులం వస్తామని అనుమతి తీసుకున్నారని, ఆ 101 మంది జాబితా ప్రకారం అనుమతి ఉన్న రైతులనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. అందరూ గుంపుగా వస్తే అనుమతించేది లేదని తెగేసి చెప్పారు.

రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు. కానీ ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువమంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలో అనేక మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిపోయింది.

హర్యానా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా 16 మంది రైతులు గాయపడ్డారని రైతు నేతలు పేర్కొన్నారు. వారిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కులీలకు పెన్షన్లు, విద్యుత్ చార్జీల పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను రైతులు కోరుతున్నారు.

దీంతోపాటు భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారానికి చర్చలు ప్రారంభించాలని రైతు నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతోపాటు అంబాల జిల్లాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. 101 మంది రైతుల బృందం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభించింది.

శంభు సరిహద్దు వద్ద రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారిగేట్లను ఇప్పటికే ఏర్పాటు చేయించారు. ఢిల్లీ వైపు నిరసనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం మొదలై, క్రమంగా టియర్ గ్యాస్ ప్రయోగించే స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతోంది.