
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కేసు నమోదైనట్టు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షయాదవ్ తెలిపారు. ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అంతేగాక, అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో తెలియజేయకుండా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు. సెక్షన్ 105, 118 బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో వేయడంతో భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అభిమానులతో పాటు కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తొలుత సమాచారం ఇవ్వలేదని యాదవ్ చెప్పారు.
దానికి తోడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని చెప్పారు. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.
పోలీసులు అభిమానులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగిందని, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారని డిసిపి తెలిపారు. రేవతితో పాటు కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి, శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వెల్లడించారు.
బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని విమర్శించారు. నిజానికి బెనిఫిట్ షో డబ్బులు చారిటీకి ఇవ్వాలని, మరి ఈ డబ్బులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతోపాటు వారి కుమారుడి చదువు బాధ్యతలు అల్లు అర్జున్ చూసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ (13)కు అల్లు అర్జున్ అంటే ఎనలేని ఇష్టం. అదే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. పుష్ప-2 ప్రీమియర్ షో చూడాలని కుమారుడు పట్టుబట్టడంతో తండ్రి భాస్కర్ రూ.1100 చొప్పున టికెట్లు కొని భార్య రేవతి, కుమారుడితో కలిసి వెళ్లారు.
థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది క్రితం భాస్కర్ అనారోగ్యానికి గురైతే రేవతి తన కాలేయాన్ని ఇచ్చి కాపాడుకుంది. ప్రాణాపాయం నుంచి భర్తను కాపాడిన ఆమె ఇప్పుడిలా మృతి చెందడంతో అది తలచుకుని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర