సస్కి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 142 కోట్లతో రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. భారత పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సస్కి) పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం కోసం 23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు 50 సంవత్సరాల కాలవ్యవధితో వడ్డీరహిత రుణాలు అందించడం జరుగుతుంది. తద్వారా, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుంది.ఇందులో తెలంగాణ నుంచి సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్ (సుస్థిర పర్యాటక సర్క్యూట్స్ కింద రూ. 74 కోట్లతో రామప్ప ప్రాంతం, వెల్ నెస్ & స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల కింద రూ. 68 కోట్లతో సోమశిల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక, పర్యాటక ప్రాంతాలను నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. అందులో ముఖ్యంగా స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ. 92 కోట్లతో సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ ను అభివృద్ధి చేసింది.
ప్రసాద్ పథకం కింద రూ. 62 కోట్లతో రామప్ప ఆలయం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటితోపాటుగా స్వదేశ్ దర్శన్ పథకం కిందనే రూ.80 కోట్లతో ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్ లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ ను.. రూ.97 కోట్లతో కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ – పైగా టూంబ్స్ – హయత్ బక్షి మసీదు – రేమండ్స్ టూంబ్స్ కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ ను అభివృద్ధి చేసింది.
అలాగే, ప్రసాద్ పథకం కింద రూ.42 కోట్లతో భద్రాచలం రాముల వారి ఆలయం, రూ.37 కోట్లతో ఆలంపూర్ జోగులాంబ ఆలయం, రూ.4.5 కోట్లతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేసి వేగవంతంగా అభివృద్ధి పనులను చేపడుతోంది.
వీటితోపాటుగా స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.57 కోట్లతో భువనగిరి కోట అభివృద్ధి, రూ.38 కోట్లతో అనంతగిరి ఎకో టూరిజం ప్రాజెక్టులను, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పథకం కింద రూ.25 కోట్లతో నల్గొండ కల్చర్ & హెరిటేజ్ ప్రాజెక్టు, రూ.10 కోట్లతో కామారెడ్డి (కల్కి చెరువు) ఎకో టూరిజం ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేశామని కిషన్ రెడ్డి వివరించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు