జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన ప్రముఖ బ్యూరోక్రాట్, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా మారిన దివంగత జగ్ మోహన్ కుమారుడు జస్టిస్ మన్మోహన్ (61). జస్టిస్ మన్మోహన్ 1962 డిసెంబర్ 17న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీ నుంచి హిస్టరీలో బీఏ పూర్తి చేశారు. 1987లో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు.
అదే ఏడాది న్యాయవాది అయ్యారు. న్యాయవాదిగా ప్రధానంగా భారత సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, పన్ను, మధ్యవర్తిత్వం, ట్రేడ్ మార్క్, సర్వీస్ లిటిగేషన్ లలో ప్రాక్టీస్ చేశాడు. భారత ప్రభుత్వం తరఫున సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా జస్టిస్ మన్మోహన్ పనిచేశారు. 2003లో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది.
2008 మార్చిలో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాదే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2023 నవంబర్ లో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
More Stories
లింగాయత్ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?