* హిందువులపై పెరుగుతున్న దాడుల పట్ల బంగ్లా మాజీ విదేశాంగమంత్రి ఆందోళన
భారత వ్యతిరేక ధోరణులను పెంచుతూ, ఛాందసవాదులు, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తూ బంగ్లాదేశ్‌ను “పూర్తి అరాచకం”లోకి నెట్టివేసే వ్యూహాలను తాత్కాలిక దేశాధినేత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్నదని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ విమర్శించారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం `ప్రజాస్వామ్యం’ స్థానంలో “మాబోక్రసీ”ని అనుమతిస్తున్నదని ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళనల సమయంలో దేశం వదిలి వెళ్ళిపోయిన ఆయన ఓ రహస్య స్థావరం నుండి ఓ వార్తాసంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో షేక్ హుస్సేన్ ను తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ లో జమాత్-ఇతో సహా అతివాద గ్రూపులు క్రియాశీలకంగా మారడంతో దేశంలో మైనారిటీల పరిస్థితి “ఆందోళనకరంగా” ఉందని తెలిపారు. “కొంతమంది ప్రస్తుత అస్థిరతను ఉపయోగించుకోవడం ద్వారా బంగ్లాదేశ్‌ను ‘రెండవ ఆఫ్ఘనిస్తాన్’గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు” అంటూ హెచ్చరించారు.
హిందూ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలపై దాడులు “సమస్యాత్మక నమూనా”లో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఇది “మైనారిటీ వ్యతిరేక సెంటిమెంట్‌ను అతివాద వాక్చాతుర్యంతో ముడిపడి ఉందని, ఇది లౌకిక సూత్రాలు, మతపరమైన మైనారిటీల భద్రత రెండింటినీ ప్రమాదంలో పడేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులపై హింస, దేవాలయాలపై దాడులు పెరగడం భారతదేశ వ్యతిరేక ధోరణులతో బలంగా సంబంధం కలిగి ఉందని మహమూద్ స్పష్టం చేశారు.
లౌకిక రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడిన వారే ఇప్పుడు చులకనగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరులో అదే వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల అంశం “అతిగా ప్రచారం చేయబడింది” అని ముహమ్మద్ యూనస్ పేర్కొనడం గమనార్హం. ఈ దాడులు మతపరమైన కంటే రాజకీయంగా ఉన్నాయని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు.
చాలా మంది హిందువులు ఇప్పుడు పదవీచ్యుతులైన అవామీ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారనే భావన నుండి ఉద్భవించిందనే ముహమ్మద్ యూనస్ చేసిన ఈ వాదనను మహమ్మద్ గట్టిగా ఖండించారు: “ఈ సమస్య రాజకీయ అవగాహనకు సంబంధించినది కాదు. కానీ మతపరమైన మైనారిటీల భద్రతకు నిజమైన, పెరుగుతున్న ముప్పు అని హెచ్చరించారు.
హిందువులపై పెరుగుతున్న హింసకు యూనస్ పరిపాలనలో అదుపులేని స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు తాను విశ్వసిస్తున్న “ఛాందసవాద శక్తుల”లే కారణం అని స్పష్టం చేశారు. “ఈ శక్తులను బలోపేతం చేయడం బంగ్లాదేశ్ సెక్యులర్ ఫాబ్రిక్‌కు ప్రమాదకరం” అని ఆయన హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో తీవ్రవాద గ్రూపులు పుంజుకున్నప్పుడల్లా భారతదేశ వ్యతిరేక భావాలు చారిత్రాత్మకంగా ట్రాక్షన్‌ను పొందాయని ఆయన గుర్తు చేశారు.
చారిత్రాత్మకంగా, 1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు దాదాపు 22 శాతం ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నేడు, సామాజికంగా, రాజకీయంగా అట్టడుగున, చెదురుమదురు హింస కారణంగా వారు దాదాపు 8 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల తిరుగుబాటు తర్వాత ఆగస్టు 5న తొలగించబడే వరకు షేక్ హసీనా మంత్రిత్వ శాఖలోని సీనియర్ సభ్యులలో ఒకరైన మహమూద్, అమెరికాలోని కొత్త ట్రంప్ పరిపాలన బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం