దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో కేంద్రం రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ లో గతంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో జరిపిన భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఏపీలో జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం రూ.23,000 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని ప్రధానికి వివరించారు. ఆ నిధులతో కూడా నాసిరకమైన పనులు చేశారని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన పనులతో ఏ మాత్రం ప్రయోజనం లేదన్న పవన్ కళ్యాణ్ దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం అందలేదని ప్రధానికి వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా తాము ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్ ను ప్రధాని ఎదుట ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరాలను మోడీకి తెలిపారు. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారని పేర్కొన్నారు.
ఏపీలోని ప్రస్తుత ఎన్డీఏ సర్కారు జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు మోదీకి వివరించారు. గ్రామీణ ప్రాంతాల వారికి 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
జల్ జీవన్ మిషన్ అమలు కోసం కొత్తగా రూపొందించిన డీపీఆర్ అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. “దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది మా ఆశయం” అని చెప్పారు.
‘‘ప్రధాని మోదీ నాపై చూపే అభిమానం, ఆప్యాయత ఎంతో విలులైనది. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు. గాంధీనగర్‌లో నా మొదటి సమావేశం నుంచి ఈ సమావేశం వరకు, మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని పవన్ కల్యాణ్ ఈ భేటీ అనంతరం ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి