దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
యాక్షన్ ప్లాన్-4 అమలుతో నిర్మాణరంగంలో కార్మికులు పనులు కోల్పోయారు. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించేందుకు సెస్‌ను ఉపయోగించాలని ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది. చాలామంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని, ఆన్‌లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున విద్యాసంస్థలను పునః ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కి సూచించింది.
వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. అయితే, చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదవుతున్నది. కాలుష్యం నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేశారు. ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ తరగతులను నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.
ఇటీవల ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడుకావడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఈ క్రమంలో జనం శ్వాస తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడ్డారు. కాలుష్యం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం