ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. నకిలీ వాణిజ్య సందేశాలు, ఓటీపీలు వస్తూ మోసాలకు తెరలేపుతున్నాయి. ఈ ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని ఇటీవల ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. వాణిజ్య సందేశాలు, ఓటీపీకి సంబంధించిన ట్రేసబిలిటీ నియమాలను అమలు చేయడానికి ట్రాయ్ గత ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రూల్స్‌ను ట్రాయ్ అనేక సార్లు పొడిగించింది.
ట్రాయ్ ఓటీపీ మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు అక్టోబర్ 31వ తేదీ వరకు సమయం ఉండేది. కానీ మరోసారి సమయాన్ని పొడిగించిన తరువాత ఇప్పుడు నవంబర్ 31 వరకు మాత్రమే ఉంది. జియో, ఎయిర్ టెల్, విఐ (ఒడాఫోన్), బిఎస్‌ఎన్‌ఎల్ కంపెనీల డిమాండ్‌ను అనుసరించి, ట్రాయ్ కంపెనీ తన గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు దాని గడువు నవంబర్‌లో ముగుస్తుంది.
గడువు ముగిసిన తరువాత ఆయా టెలికం కంపెనీలు వాణిజ్య సందేశాలు, ఓటీపీ మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి ట్రేస్‌బిలిటీ నియమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు డిసెంబర్ 1 నుండి ట్రేసబిలిటీ నియమాన్ని అమలు చేస్తే, ఫోన్లకు ఓటీపీ మెసేజ్ రావడానికి సమయం పట్టవచ్చు.
అలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్ లేదా రిజర్వేషన్ వంటి ఏదైనా పని చేస్తే, ఓటీపీ పొందడానికి అవకాశం ఉంది. ట్రాయ్ అలాంటి చర్య తీసుకుంది. ఎందుకంటే చాలాసార్లు స్కామర్లు నకిలీ ఓటీపీ మెసేజ్‌లను పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అన్ని టెలికాం కంపెనీలకు కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం