‘‘కొండ ప్రాంతాల్లో కూడా 84లక్షల ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా వివిధ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లల్లో 5.36లక్షల కోట్లతో మరో మూడు లక్షల ఇళ్లు నిర్మించేంలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీలో పట్టణాల్లో 21.37లక్షల ఇళ్లను కేటాయించగా, గ్రామాల్లో 2.30లక్షల ఇళ్లను నిర్మాణం చేసింది. ఇందు కోసం రూ. 32వేల కోట్లు కేటాయించగా, పూర్తైన ఇళ్లకు రూ. 23వేల 800కోట్లు విడుదల కూడా చేసింది” అంటూ ఆమె వివరించారు.
రూ.1.80లక్షలు ఒక్కో ఇంటికి కేంద్రం ఇవ్వడంతో పాటు, బ్యాంకులో రుణ సదుపాయం కూడా కల్పించిందని ఆమె చెప్పారు. అయితే, ప్రశ్నించిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించిన జగన్ ఇప్పుడు మానవత్వ విలువలు అంటూ మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లల్లో ఇటువంటి మానవత్వం జగన్‌లో ఎందుకు లేకుండా పోయిందని ఆమె ప్రశ్నించారు.
కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల పుస్తెలు తెంపన వ్యక్తి జగన్ గంజాయి, మద్యం, డ్రగ్స్, చీప్ లిక్కర్, మహిళల మిస్సింగ్‌లో, శాంతిభధ్రతల క్షీణించడంలో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలిపారని ఆమె ధ్వజమెత్తారు. మరో రెండు నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేయాలనే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ చేతకాని విధానాలతో దుర్వినియోగం చేశారని ఆమె ధ్వజమెత్తారు.
‘‘ఏపీ అభివృద్దిలో కేంద్రం చాలా సహకారం అందిస్తుంది. ఇవన్నీ చూసి జగన్ తట్టుకోలేక.. డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టే.. వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోచుకున్న నాయకులు పచ్చి బూతులు మాట్లాడారు. మహిళలపై అన్యాయంగా పోస్టులు పెట్టి, నోరు పారేసుకున్న వారు నేడు అనుభవించాల్సిందే” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దయ, జాలి, కరుణ ఏమాత్రం చూపని జగన్, వైసీపీ నేతలు చట్టం ముందు దోషులుగా నిలబపడి తీరుతారని బిజెపి నేత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందని చెబుతూ అమరావతి రాజధానికి కూడా కేంద్రం నిధులు విడుదల చేసిందని ఆమె గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వచ్చే ఐదేళల్లో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు చూసి అందరూ ఆశ్చర్యపోతారని యామినీ శర్మ భరోసా వ్యక్తం చేశారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష