ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస సెంచరీలు సాధించిన టీమిండియా యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలను మెరుగుపరుచుకొని టాప్-కి చేరుకున్నాడు. తిలక్ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు సంపాదించడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను వెనక్కి నెట్టి భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పాండ్యా బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో గెలుచుకున్నది. టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడం ఇది రెండోసారి. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ నాలుగో స్థానంలో, శ్రీలంక మాజీ కెప్టెన్ వనిందు హసరంగ ఐదో స్థానంలో నిలిచారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ 280 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 69 స్థానాలను మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరుకున్నాడు. నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కొనసాగుతుండగా, రెండోస్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ ఉన్నాడు.
ఇక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన సంజూ శాంసన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల జాబితాలో 17 స్థానాలను మెరుగుపరుచుకొని 22వ స్థానానికి చేరాడు. ట్రిస్టన్ స్టబ్స్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి, హెన్రిచ్ క్లాసెన్ ఆరు స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరుకున్నారు.
శ్రీలంక కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 12వ ర్యాంక్‌కు చేరుకోగా, వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్ 16 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ 10 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇదే బెస్ట్ ర్యాంకింగ్ కావడం విశేషం.
More Stories
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ
అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం