ప్రధాని మోదీకి డొమినికా, గయానా అత్యున్నత పురస్కారాలు

ప్రధాని మోదీకి డొమినికా, గయానా అత్యున్నత పురస్కారాలు
 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, డొమినికా, గయానా దేశాలు అరుదైన గౌరవం ఇచ్చాయి. తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాలను అందించాయి. ‘డొమినికా అవార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’తో సత్కరించింది కామన్వెల్త్‌ ఆఫ్‌ డొమినికా. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ప్రధాని మోదీకి అందజేశారు. అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానట్లు ప్రధాని మోదీ పోస్ట్​ చేశారు.
 
మరోవైపు గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ప్రధాని మోదీకి అందించింది. గయానా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఈ అవార్డును అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకు గాను ఈ గుర్తింపు లభించింది. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా, డొమినికా ప్రధాని స్కెర్రిక్ ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. 2021లో కరోనా మహమ్మారి చీకటి రోజుల్లో భారత్​ 70 వేల ఆస్ట్రాజెనికా టీకాలను ఉదారంగా అందించిందని, అది డొమినికాకు లైఫ్​లైన్​గా మారిందని ఆ దేశ ప్రధానమంత్రి స్కెర్రిట్ తెలిపారు.
 
 “ఇది మీ(ప్రధాని మోదీని ఉద్దేశించి) శాశ్వతమైన నాయకత్వ వారసత్వానికి, మానవత్వం పట్ల మీ నిబద్ధతకు, మాతో(డొమినికా) సహా ఇతర దేశాలపై మీరు వేసిన చెరగని ముద్రని చాలా ఉన్నతమైనది. మీరు అందించిన విరాళం, నిజమైన నాయకత్వానికి సరిహద్దులు లేవని సూచించడానికి ఒక శక్తిమంతమైన రిమైండర్. మీరు చేసిన ఈ ఒక్క సాయం, గ్లోబల్​ పార్టనర్​ షిప్​, సౌత్​ – సౌత్​ భాగస్వామ్యాన్ని ప్రతిధ్వనిస్తోంది” అంటూ కొనియాడారు. 
 
ఈ గౌరవం(మోదీకి ఇచ్చిన పురస్కారం) డొమినికా, భారత్​ భాగస్వామ్య విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం పట్ల మన దేశాలకు ఉన్న అంచంచలమైన అంకితభావం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృఢ సంకల్పం, ఐక్యత వల్ల వచ్చే శక్తిపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.  “మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తి, మన దేశాలను వేరు చేసే మహాసముద్రాలకు మించి విస్తరించి ఉందని మేము గుర్తించాము. మానవాళి శ్రేయస్సు కోసం మీరు చేసిన నిరంతర శ్రమకు, డొమినికా మాదిరిగానే, ప్రపంచం మొత్తం మీకు రుణపడి ఉంటుంది ” అని ప్రధాని మోదీని ప్రశంసించారు స్కెరిట్.