బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై బెదిరింపుల కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లాయర్ ఫైజాన్ ఖాన్‌గా గుర్తించిన ముంబయి పోలీసులు అతడ్ని మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. రాయ్‌పూర్‌లోని అతడి ఇంటిలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
గతవారం షారుఖ్ ఖాన్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకుంటే షారుక్‌ను చంపుతానని బెదిరించాడు. దీనిపై కేసు నమోదుచేసిన బాంద్రా పోలీసులు లోతైన విచారణ జరిపి నిందితుడ్ని గుర్తించారు. అయితే, తన మొబైల్ ఫోన్ చోరీకి గురైందని, దాన్ని తస్కరించినవారే ఆ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ చేశారని బుకాయించాడు. దీనిపై నవంబరు 2న తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
అయితే, పోలీసులు తమదైన స్టయిల్లో విచారించడంతో అతడే ఫోన్ చేసినట్టు తేలింది. బీఎన్ఎస్ సెక్షన్ 308 (4) (బెదిరింపులు లేదా తీవ్రంగా గాయపరచడం), 351 (3) (4) (నేరపూరిత బెదిరింపులు) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, కింగ్ ఖాన్‌కు గత అక్టోబరులోనూ ఇటువంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. ముందు ఆయనకు ఇద్దరు గన్మెన్లతో మాత్రమే సెక్యూరిటీ ఉండేది. దాన్ని వై ప్లస్‌గా మార్చడంతో ఆరుగురు సాయుధ సైనికులు 24 గంటలూ విధుల్లో ఉంటారు.
ఇక, సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామన డబ్బులు ఇవ్వాలని రకరకాల బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిన ఘటన సంచలనంగా రేపింది. సల్మాన్ బెదిరింపులో కేసులో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు.
బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడ్ని అంటూ ముంబయి పోలీసులకు ఫోన్ చేసి, కృష్ణ జింకను వేటాడినందుకు ఆలయంలో క్షమాపణ చెప్పాలని లేదా రూ. 5 కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది.
అలాగే, రెండు రోజుల కిందట సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం రాత్రి ఫోన్ చేసిన ఆగంతకులు ఓ పాటలో లారెన్స్ బిష్ణోయ్ పేరు వాడారని, సల్మాన్‌తో పాటు రచయిత నెల రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.
అలాగే, రెండు రోజుల కిందట సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం రాత్రి ఫోన్ చేసిన ఆగంతకులు ఓ పాటలో లారెన్స్ బిష్ణోయ్ పేరు వాడారని, సల్మాన్‌తో పాటు రచయిత నెల రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.
More Stories
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?