భాగ్యనగర్ లో జిహాదీ ముఖాలు రెచ్చిపోతున్నాయి. న్యాయవాది కళ్యాణ్ పై మంగళవారం ఉదయం హత్యాయత్నం చేశారు. హిందూ కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్న కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని కత్తులతో దాడికి దిగారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సమీపంలోని (ఐమాక్స్ ) ప్రసాద్ థియేటర్ సమీపంలో ఒంటరిగా వెళుతున్న అడ్వకేట్ కళ్యాణ్ ను చంపేందుకు జిహాదీ ముఖలు కత్తులతో దాడికి తెగబడ్డాయి.
అటుగా వెళుతున్న కళ్యాణ్ కు రాంగ్ రూట్లో ఎదురుగా వెళ్లి దాడికి పాల్పడ్డారు. తప్పించుకునే క్రమంలో చేతులు అడ్డు పెట్టడంతో ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు. అయితే దీనిని సెల్ ఫోన్ దొంగల ముఠాగా చిత్రీకరించేందుకు పోలీసులు వక్రీకరించడం భావ్యం కాదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్డాక్టర్ రామ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నం కొనసాగించడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయవాదిగా సమాజ సేవలో పాల్గొంటున్న కళ్యాణ్ పై దాడికి దిగడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దాడులకు పాల్పడ్డ వారందరూ పిచ్చి వాళ్లని సర్టిఫికెట్ ఇవ్వడంలో సఫలీకృతం అవుతున్న ప్రభుత్వం.. ఈ దాడిని కూడా దొంగల ముఠాగా చిత్రీకరించడం తగదని హెచ్చరించారు.
సెల్ ఫోన్ దొంగలకు కత్తులతో వెంబడించి కసిగా పొడవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని పోలీసులను డాక్టర్ రామ్ సింగ్ ప్రశ్నించారు. ఇంతటి మహానగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై కత్తులతో దాడికి చేసి పారిపోయినప్పటికీ పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమాత్రం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని, పట్టపగలే హత్యలు జరుగుతున్న కూడా పట్టించుకోవడంలేదని తీవ్ర విమర్శలు చేశారు.
చీమ చిటుక్కుమన్నా పట్టుకునే రీతిలో దేశానికే ఆదర్శంగా ఉన్న హైదరాబాద్ సిసి కెమెరాలు మూత పడ్డాయా? అని ప్రశ్నించారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న కళ్యాణ్ పై ప్రభుత్వమే ఈ దాడి చేయించినదని, దీని వెనుక ఉన్న జిహాదీ మాఫియాను బయటపెట్టాలని విశ్వహిదూ పరిషత్ నేత డిమాండ్ చేశారు.
బాధితుడికి ప్రభుత్వం రక్షణ కల్పించి ప్రాణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళనలకు సిద్ధమవుతామని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు