ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం దూరంగా నెట్టివేస్తుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన పుట్టినరోజున పార్టీ అగ్రనేతలు ఎవ్వరూ శుభాకాంక్షలు తెలపగా పోవడంతో ఈ విషయమై కాంగ్రెస్ వర్గాలలో నెలకొన్న గందరగోళాన్ని వెల్లడి చేస్తున్నది. ఉదయాన్నే ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. కానీ గాంధీ కుటుంభం నుండి ఎవ్వరూ స్పందించలేదు.
గాంధీ కుటుంభంకు నమ్మిన బంటుగా ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా లలో ఎవ్వరూ శుభాకాంక్షలు చెప్పకపోవడం విస్మయం కలిగిస్తుంది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, రేవంత్ కు అండగా ఉంటూ వస్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సహితం శుభాకాంక్షలు తెలపలేదు.
రేవంత్‌ను అధిష్ఠానం దూరం పెడుతున్నదన్న వార్తలకు ఇది మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, ముఖ్యమంత్రి మార్పు ఇక లాంఛనమేనన్న ప్రచారం కూడా జరుగుతున్నది. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన వారి పేర్లను సీఎంవో కార్యాలయం అధికారిక సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్టు చేసింది. ఆ పేర్లలో అధిష్ఠానం పెద్దల పేర్లు కనిపించలేదు.
ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రాధేయపడినా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ దొరకలేదని, ప్రియాంకగాంధీ నామినేషన్ కార్యక్రమానికి వయనాడ్ వెళ్లినప్పటికీ అక్కడ ఆమె కూడా పలకరించలేదని, త్వరలోనే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజా ఘటన బలం ఇచ్చినట్టు అయిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
మరోవంక, కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన అవసరమైన సహకారం పొందగలుగుతున్నారు. తమది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో కేంద్రం వివక్షత చూపుతున్నదని రేవంత్ గాని, ఆయన మంత్రులు గాని ఎవ్వరూ ఇప్పటివరకు చెప్పే అవకాశం రాకపోవడం గమనార్హం. రేవంత్ కోరినప్పుడల్లా ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌షా వంటి కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయని పార్టీలోని కొందరు నేతలు చెప్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే రేవంత్‌కు మోదీ ఉదయం 8:30 గంటలకే శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సినీ నటుడు చిరంజీవి, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లోర్సన్ తదితరులు ఉన్నారు.
మరోవైపు, రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదన్న విష యం సోషల్ మీడియాకెక్కి విపరీతంగా ట్రోల్ కావడంతో రేవంత్ స్వయంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటలకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సమయం తీసుకుని మరీ తనకు వ్యక్తిగతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు రాహుల్ భయ్యాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు రేవంత్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం