మణిపూర్ లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సాయుధులైన వ్యక్తులు చెలరేగిపోయారు. జిరిబామ్ జిల్లాలోని గిరిజన గ్రామమైన జైరోన్ హ్మార్‌పై గురువారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఆరు ఇళ్లకు నిప్పుపెట్టారు. ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల తల్లి మంటల్లో కాలి మరణించింది. భర్త, పిల్లల కళ్ల ముందే ఆమె చనిపోయింది.
ఇళ్లు కాలిపోవడంతో పలువురు గిరిజనులు నిరాశ్రయులయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కాలుతున్న ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. దాడి సమయంలో పలువురు గ్రామస్థులు పారిపోయి సమీపంలోని అడవిలో తలదాచుకున్నారని, కనీసం ఆరు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
కాగా, మణిపూర్‌లో కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం మైతీ, కుకీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో చర్చలు జరిపారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 7న జిరిబామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మణిపూర్‌లో గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 200 మందికిపైగా మరణించగా వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు 53 శాతం ఉన్న మొయితీలు ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతంలో నివసిస్తుంటారు. నాగాలు, కుకీలతో కూడిన గిరిజనులు 40 శాతం మంది ఉన్నారు. వీరు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఇరువర్గాల మధ్య గతేడాది మేలో జాతి ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. సుమారు 200 మందికిపైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం