
ఉత్తర కొరియా విజయవంతంగా లాంగెస్ట్ బాలిస్టిక్ మిస్సైల్‌లో పరీక్షించింది. సుదూరంలో ఉన్న అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రష్యాకు సహాయం అందించేందుకు దళాలను పంపిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న మరోసారి మిస్సైల్‌ను పరీక్షించడంతో అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఉత్తర కొరియా ప్రయోగించిన మిస్సైల్‌ను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా భావిస్తున్నామని అమెరికా తెలిపారు. ఉత్తర కొరియా పరీక్షించిన మిస్సైల్ ఎక్కువ ఎత్తు వరకు, ఎక్కువ సమయం ప్రయాణించిందని జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానీ తెలిపారు. ఈ క్రమంలో ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా అమెరికా సైతం వ్యూహాత్మక విస్తరణను సిద్ధం చేస్తున్నది. మిస్సైల్ టెస్ట్‌పై ఉత్తర కొరియా ప్రకటన చేయలేదు. క్షిపణి గరిష్ఠంగా 7వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు వెళ్లిందని జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఇది రికార్డు అని, దాదాపు 1.26 గంటల పాటు దూసుకెళ్లిందని పేర్కొంది.
ఇక గతేడాది సైతం ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించింది. గురువారం ఉదయం 7.10 గంటలకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలోని సైట్ నుంచి క్షిపణి ప్రయోగించింది. ఉత్తర కొరియా అమెరికా వరకు చేరుకునేలా రూపొందించిన క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతోందని దక్షిణ కొరియా సైనిక నిఘా సంస్థ బుధవారం చట్టసభ సభ్యులకు తెలిపింది.
అదే సమయంలో ఏడవ అణ్వాయుధ పరీక్షకు సన్నాహాలు పూర్తి పేర్కొంది. దక్షిణ కొరియాపై దాడి చేయగల షార్ట్‌రేంజ్ అణు మిస్సైల్స్ సైతం ఉత్తర కొరియా వద్ద ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
More Stories
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్
వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్
సిక్కు మహిళపై లైంగిక దాడిని ఖండించిన బ్రిటిష్ ఎంపీ