ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం 24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇందులో టిటిడి ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు)కు అవకాశం కల్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతోపాటు మరో 23 మంది పాలకమండలి సభ్యుల పేర్లతో జాబితాను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు.
ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.
టీటీడీ బోర్డు సభ్యులు
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి), జాస్తి పూర్ణ సాంబశివరావు, శాంతారామ్, శ్రీసదాశివరావు నన్నపనేని, జంగా కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జానకీ దేవి తమ్మిశెట్టి.
నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ (తెలంగాణ), బూరగాపు ఆనందసాయి (తెలంగాణ), సుచిత్ర ఎల్ల (తెలంగాణ), కృష్ణమూర్తి ( తమిళనాడు), పి.రామ్మూర్తి (తమిళనాడు), దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక), జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక), నరేశ్‌కుమార్ ( కర్ణాటక), డా.అదిత్ దేశాయ్ (గుజరాత్), శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర).
More Stories
ఏపీలో రెండు జాతీయ రహదారుల విస్తరణ
వైసిపి ఎమేల్యేలకన్నా ఎక్కువ మంది ప్రభుత్వ విప్ లు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్