స్వదేశీ కేవలం ఆర్ధిక భావన మాత్రమే కాదని, స్వావలంబన వ్యక్తీకరణ అని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్వదేశీ జాగరణ మంచి, స్వావలంబి భారత్ అభియాన్ ల ఆధ్వర్యంలో జరుగుతున్న స్వదేశీ మేళలో పాల్గొంటూ స్వదేశీ మేళ మన గొప్ప సాంస్కృతిక వారసత్వం, స్వదేశీ నైపుణ్యాల వేడుక మాత్రమే కాదని చెప్పారు.
శతాబ్దాలుగా భారత భూమికి మార్గనిర్ధేశం చేసిన మన భారత భూమి పురాతన జ్ఞానంలో పాతుకుపోయిన వారసత్వ సంపదకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. బాహ్య దేశాలపై ఆధారపడకుండా పరిష్కారాలకోసం అంతర్గతంగా ఆధారపడాలనే ఆలోచనలను ప్రోత్సహించే సూత్రమని ఆయన తెలిపారు. స్వదేశీ భావన మన సొంత వనరులను గుర్తించడం, వాటిని ప్రోత్సహించడం నేర్పుతుందని ఆయన చెప్పారు.
అవి భౌతికమైనవి, మేధోపరమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి కావచ్చని చెబుతూ మన మూలాలు, మన ప్రజలతో లోతైన సంబంధాలను పెంచుకోవాలని ఇది మనలను ప్రోత్సహిస్తోందని ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
జె ఎన్ టి యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ స్పూర్తితో స్వదేశీ వస్తువుల ప్రాచుర్యాన్ని దేశ వ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా నిర్వహిస్తూ స్వదేశీ మేళ ద్వారా స్వదేశీ వస్తువుల ప్రాచుర్యాన్ని ప్రతి ఒక్కరూ అర్ధంచేసుకొనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్ ను అభినందించారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?