
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహద పడుతుందని చెబుతూ ఏపీ ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన అంశమని ఆమె చెప్పారు. పర్యావరణ మార్పు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటవీ సంపదకు హాని కలగకుండా అంటే 25 లక్షల చెట్లు నాటాలని నిర్ణయించడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు. ఈ సందర్బంగా కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రజల తరపున ఆమె ధన్యవాదములు తెలిపారు.
అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైల్ లైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని ఆమె కొనియాడారు.
వికసిత్ భారత్ 2047 సాధించాలనేది బీజేపీ లక్ష్యమని చెబుతూ ఈ లక్ష్య సాధనలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాల ముఖ్యమైన అంశమని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలపడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
‘అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పారు. ఈ రైలుమార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటి వస్తుందని పేర్కొన్నారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు