వరంగల్ లో త్వరలో రూ 650 కోట్ల వ్యయంతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పటంతో ఆ ప్రాంత ప్రజల కల నెరవేరబోతునట్టయింది.
హైదరాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సంర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి దేశంలోనే దక్షిణ మధ్య రైల్వేలో పనులు అతివేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ లైన్‌లు ఎలక్ట్రిఫికేషన్ పరిధిలో జరగుతున్ననాయని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే వరంగల్ రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటుపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌లో రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే కేంద్ర ముఖ్య ఉద్దేశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రానున్న రోజుల్లో మరో 5 వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్ర సర్కారును కోరినట్టుగా కూడా ఆయన తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వేలో చేపట్టిన 40 రైల్వే స్టేషన్‌ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే రూ.430 కోట్లతో చేపటట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయ్యిందని చెప్పుకొచ్చారు. ఎంఎంటీఎస్ లైన్ ప్రస్తుతం ఘట్కేసర్ వరకు ఉందని గుర్తు చేసిన కిషన్ రెడ్డి దాన్ని రాయగిరి, యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రైల్వే అభివృద్ధికి ఈ ఏడాది రూ.6 వేల కోట్ల బడ్జెట్ మంజూరైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో.. రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ పాల్గొనగా ఆయా నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న పనులు, చేపట్టాల్సిన రైల్వే నిర్మాణాలపై వాళ్లంతా సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు