రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనడానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తామంతా చేసే ప్రయత్నాలు మానవత్వానికి ప్రధాన్యమిస్తాయని చెప్పారు. రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారానికి సాధ్యమైన సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
ఎలాంటి సంక్షోభానికైనా చర్చలే పరిష్కార మార్గమని స్పష్టం చేస్తూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము నమ్ముతున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. ర రెండున్నరేళ్లకు పైబడి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
రష్యాలోని కజాన్ నగరంలో మంగళవారం ప్రారంభమైన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. రష్యా అధినేతతో చర్చలు జరిపారు. జులైలో జరిగిన భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశం ప్రతి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసిందని వెల్లడించారు. మూడు నెలల్లోపే రష్యాలో రెండోసారి పర్యటిస్తుండడాన్ని ప్రస్తావించి ఇది రెండు దే శాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు, ప్రగాఽఢమై న విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు.
బ్రిక్స్ సదస్సుకు సారథ్యం వహించడమే కాక మరికొన్ని దే శాలూ చేరేలా చొరవ చూపినందుకు పుతిన్‌కు అభినందనలు తెలిపారు. సదస్సు ముగింపు సందర్భంగా.. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలను సభ్యదేశాలుగా చేర్చుకుంటూ ‘కజాన్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. దీంతో సభ్యదేశాల సంఖ్య 10కి పెరగనుంది.
ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. “జులైలో మనం కలిసిన విషయం నాకు గుర్తుంది. పలు సమస్యలపై మంచి నిర్ణయాలు తీసుకున్నాం. నా ఆహ్వానం మేరకు కజాన్కు మీరు రావడం గొప్ప విషయం. ఈ రోజు మనం బ్రిక్స్ ఓపెనింగ్ సెరెమొనీలో పాల్గొంటాం. అనంతరం డిన్నర్ ఉంటుంది. అనంతరం బ్రిక్స్లోని ఇతర సభ్యులతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం” అని పుతిన్ చెప్పారు.
(నవ్వుతూ) ఇక ఇరు దేశాల మధ్య ఉన్న సబంధాలకు అనువాదం అవసరం లేదని తనకు అనిపిస్తుందని పుతిన్ చెప్పగా ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించారు.
కాగా, బుధవారం నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. కజాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రధాన పరిణామాన్ని ధృవీకరించింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రేపు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని నేను ధృవీకరించగలను’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.
ముఖ్యంగా, 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది మొదటి సమావేశం కావడం గమనార్హం. అయితే, ఇద్దరికీ కనీసం రెండుసార్లు క్లుప్తంగా పరస్పరం మాట్లాడుకున్నారు. ముందుగా, నవంబర్ 2022లో ఇండోనేషియాలోని బాలిలో జరిగే జి20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, ఆపై ఆగస్ట్ 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో క్లుప్తమైన పరస్పర చర్చల సందర్భంగా, సరిహద్దుతో పాటు సైనిక ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు అంగీకరించారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు