
అలాగే, బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ ఇంటర్నెట్ యూజర్ల కోసం నేషనల్ వైఫై రోమింగ్ సేవలను సైతం ప్రారంభించింది. దాంతో యూజర్లు అదనపు ఛార్జీలు లేకుండా బీఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్స్‌లలో హైస్పీడ్ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. దాంతో డేటా ఖర్చులు తగ్గుతాయని కంపెనీ పేర్కొంటుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ 500కిపైగా లైవ్ ఛానెల్స్, పే టీవీ ఆప్షన్స్‌ని కలిగి ఉన్న కొత్త ఫైబర్ ఆధారిత టీవీ సర్వీసులను సైతం ప్రకటించింది.
ఫైబర్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది. ఆటోమేటెడ్ కియోస్క్‌లను పరిచయం చేయడం ద్వారా కస్టమర్లు తమ సిమ్ కార్డ్‌లను నిర్వహించడాన్ని సులభతరం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కియోస్క్‌లు ప్రజలు తమ సిమ్ కార్డ్‌లను సులభంగా కొనుగోలు చేయడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి, మార్చుకోవడం తదితర సేవలను అందించనున్నది.
మైనింగ్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు సీ-డీఏసీతో బీఎస్ఎన్ఎల్ జతకట్టింది. కొత్త నెట్వర్క్ స్వదేశీ సాంకేతికను ఉపయోగించనున్నది. అడ్వాన్స్డ్ టూల్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా గనుల్లో భద్రతతో పాటు సామర్థ్యం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది.
అలాగే బీఎస్ఎన్ఎల్ దేశపు తొలి డైరెక్ట్ టూ డివైజ్ కనెక్టివిటీ సొల్యూషన్‌ను ప్రారంభించింది. ఉపగ్రహ, మొబైల్ నెట్‌వర్క్‌లను మిళితం చేయనున్నది. ఈ వినూత్న సేవ అత్యవసర పరిస్థితులు, మారుమూల ప్రాంతాలకు కీలకమైనది, సాధారణ కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో సైతం డిజిటల్ చెల్లింపుల తదితర కార్యకలాపాలకు అనుమతి ఇస్తుంది.
ఇక బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన మొబైల్ నంబర్లను పొందే అవకాశం కల్పిస్తున్నది. 9444133233, 94444099099 తరహా నెంబర్ల కోసం ఇ-వేలాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ అవకాశం మూడు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నది.
More Stories
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు
ఎస్బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్‌లు తగ్గింపు