
అబద్దపు డోకా మాటలు చెప్పడంలో కేసీఆర్, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం దొందు.. దొందేనని నిజామాబాదు అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు అమలుకాని హామీలు ఇచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం మాదిరి మాయమాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కాలం గడుపుతాం అంటే సహించేది లేదని హెచ్చరించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని 10ఏళ్ళు యావత్ తెలంగాణ ప్రజలని మోసం చేసి ఒక్క ఇల్లు కూడా పేదోనికి ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కు దక్కుతుందని విమర్శించారు.
అలాంటి పాలన వొద్దని తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, వందల హామీలను చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. 100రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు 10 నెలలు గడుస్తున్నా ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిజామాబాద్ అర్బన్ లో కట్టిన ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు దేవుడెరుగు కనీసం కట్టిన ఇళ్ళైనా బాగు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అర్హులైన వారందరితో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
పొంగులేటి మాటలు పాల మీద పొంగులాగే ఉన్నాయని ఏద్దేవా చేశారు. రైతు రుణమాఫీ కూడా తూతూ మంత్రంగా చేసి డప్పులు కొడుతున్నారని, ఇంకా రుణమాఫీ కానీ రైతన్నలు ఎదురు చూస్తున్నారు.. మీరు చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, కేసీఆర్ కి పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరించారు.
More Stories
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం