చైనాతో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. చైనాతో ఏప్రిల్ 2020 యథాతథ స్థితికి తిరిగి వెళ్లడమే లక్ష్యమని ఆయన తెలిపారు. బఫర్ స్టాక్‌లు ఆక్రమణకు గురికాకుండా చూడటం చాలా ముఖ్యం అని ఆరీ చీఫ్ గుర్తించారు.
‘చైనాతో ఏప్రిల్ 2020నాటి యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. ఎల్ఏసీ పెట్రోలింగ్ ఏర్పాట్లపై భారతదేశం, చైనాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆర్మీ చీఫ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గం సుగమం చేసినట్టైంది.
భారత్- చైనా అధికారుల మధ్య కొన్ని రోజులపాటు జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరిందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. బ్రిక్స్ సమ్మిట్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో అడుగుపెట్టడానికి ఒక రోజు ముందు ఈ ఒప్పందం జరిగింది.
ఆగస్టు 29న బీజింగ్‌లో భారత్-చైనా సరిహద్దుపై సమావేశం జరిగింది. ఎల్‌ఏసీకి సంబంధించి ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొని విభేదాలకు ముగింపు పలికేందుకు చర్చలు జరిగాయి. సెప్టెంబరు 12న జెనీవాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్- చైనాల మధ్య 75 శాతం వివాదాలు పరిష్కారమయ్యాయని విదేశాంగ మంత్రి గతంలో చెప్పారు.
2020లో గాల్వాన్‌లో చైనా, భారత్‌ల మధ్య ఘర్షణ జరిగింది. జూన్‌లో గాల్వాన్‌లో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ఈ తీర్మానాలను అమలు చేసేందుకు చైనా భారత్‌తో కలిసి పనిచేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తూర్పు లడఖ్‌లో రెండు దేశాల సైన్యాల మధ్య ప్రతిష్టంభనను ముగించేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ధృవీకరించింది . ‘ఇటీవలి కాలంలో చైనా-భారత్ సరిహద్దుకు సంబంధించిన సమస్యలపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు జరిగాయి.’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు.
More Stories
జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!
సరిహద్దు భద్రతకు డ్రోన్ వ్యతిరేక విభాగం
ప్రతిపక్షాలు ప్రజాతీర్పును స్వాగతించాలి