ఇప్పటికే అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా అంగీకారాన్ని తెలియచేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏతో కుదుర్చుకోనున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్సులు, అసెంబ్లీ, సచివాలయ టవర్లు, రాజ్ భవన్, హైకోర్టు తదితర ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంది.
దీంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది. అలాగే రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం లాంటి ట్రంక్ ఇన్ఫాస్ట్రక్చర్ను చేపట్టాల్సి ఉంది. మొత్తం అమరావతి నిర్మాణానికి రూ.54 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదటి దశ పనులకు రూ.26 వేల కోట్లు అవుతుందని నివేదిక తయారు చేశారు.
ఈ నిధుల సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం హామీదారుగా ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రూపాయల రుణాన్ని రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం వినియోగించనున్నారు.
ఇక మిగిలిన రూ.11 వేల కోట్ల నిధుల మంజూరుకు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు సంతృప్తి చెందిన హడ్కో ఆమోదాన్ని తెలియచేసింది. ఈ నిధులు విడుదల కాగానే డిసెంబరు నుంచి అమరావతి రాజధాని పరిధిలో పనులు వేగం పుంజుకోనున్నాయి.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్